Internet: తీగల్లేకుండానే ఇంటర్‌నెట్‌ అనుసంధానం

ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ లేకుండానే ఇళ్లు, కార్యాలయాలకు 4జీ, 5జీ వంటి కొత్తతరం ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తెచ్చే పరికరాన్ని రూపొందించింది బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ.

Updated : 14 Dec 2022 07:06 IST

బెంగళూరు అంకుర సంస్థ రూపకల్పన

ఈనాడు, బెంగళూరు: ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ లేకుండానే ఇళ్లు, కార్యాలయాలకు 4జీ, 5జీ వంటి కొత్తతరం ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తెచ్చే పరికరాన్ని రూపొందించింది బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ. భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్సీ) ప్రోత్సాహంతో ‘ఆస్ట్రామ్‌ టెక్నాలజీస్‌’ అనే అంకుర సంస్థ వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఉపకరణాన్ని తయారుచేసింది.

బెంగళూరు శివారులోని సోంపుర గ్రామపంచాయతీ, నిదావంద ప్రభుత్వ పాఠశాలలో ఈ పరికరంతో నెట్‌ సౌకర్యాన్ని సమకూర్చింది. ఇందుకు ‘గిగామెష్‌’ ట్రాన్సీవర్‌ (ట్రాన్స్‌మిటర్‌, రిసీవర్‌) ద్వారా హై స్పీడ్‌ డేటాను ప్రసారం చేయగలమని సంస్థ సాంకేతిక విభాగం మేనేజర్‌ మంజునాథ్‌రావు తెలిపారు. సోంపుర పంచాయతీలోని భారత్‌ నెట్‌కు ఓ పరికరాన్ని అనుసంధానించగా, మరో గిగామెష్‌ను పాఠశాలలో ఏర్పాటుచేశారు. వైఫై కోసం వంద మీటర్ల ఫైబర్‌ కేబుల్‌ వినియోగించారు. గ్రామీణ ప్రాంతాలకు ఖర్చుతో కూడిన ఆప్టికల్‌ ఫైబర్‌ వ్యవస్థ లేకుండానే ఇంటర్నెట్‌ సేవలు పొందేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని ఆస్ట్రామ్‌ వ్యవస్థాపకులు నేహా సటాకా తెలిపారు. యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ నిధులతో రూపొందించిన ఈ పరికరానికి కేంద్ర టెలికామ్‌ శాఖ పురస్కారం లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని