టీకా తీసుకోండి.. ₹840 కోట్లు గెలుచుకోండి!
వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు ప్రైజ్ మనీ ప్రకటించిన కాలిఫోర్నియా రాష్ట్రం
లాస్ ఏంజెలెస్: దయచేసి కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోండి... 116 మిలియన్ డాలర్ల (సుమారు రూ.840 కోట్ల) నగదును సొంతం చేసుకోండి... అంటూ తమ రాష్ట్ర ప్రజలకు అమెరికాలోని కాలిఫోర్నియా సర్కారు లక్కీ డ్రా ప్రకటించింది! వచ్చేనెల 15న ఆంక్షలు ఎత్తివేసి, సాధారణ జీవనానికి మార్గం సుగమం చేయనున్న క్రమంలో- వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసేందుకు ఈ వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. 12 ఏళ్లు దాటినవారంతా టీకా తీసుకోవాలని నెలల తరబడి ప్రచారం చేసినా, ఇప్పటివరకూ 3.4 కోట్ల మంది జనాభాలో 63% మందే వ్యాక్సిన్ వేయించుకున్నారు. మిగిలినవారికి వీలైనంత త్వరగా తొలి డోసు అందించేందుకు ‘ప్రైజ్ మనీ’ ఆఫర్‌ను గవర్నర్ గవిన్ న్యూసమ్ ప్రకటించారు. కనీసం తొలిడోసు తీసుకుంటే దీనికి అర్హత సాధించవచ్చు.
జూన్ 4తో లక్కీ డ్రా ప్రారంభమవుతుంది. జూన్ 4తో లక్కీ డ్రా ప్రారంభమవుతుంది. మొత్తం 10 మందికి 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.10.86 కోట్లు), 30 మందికి 50,000 డాలర్లు (రూ.36.21 లక్షలు) నగదు బహుమతులతో పాటు... 20 లక్షల మందికి 50 డాలర్ల (రూ.3,600) విలువైన గిఫ్ట్ కూపన్లు ఇస్తారు! ఇప్పటికే ఒహాయో, కొలరాడో, ఒరెగాన్ రాష్ట్రాలు ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించాయి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు భారీ ఉపకారవేతనాలు, ఫీజుల చెల్లింపులు ప్రకటించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
TSRTC: ఆర్టీసీకి భారీ గి‘రాఖీ’.. రికార్డు స్థాయిలో వసూళ్లు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
-
Ap-top-news News
Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటలు.. వరుస సెలవులతో అనూహ్య రద్దీ
-
Ap-top-news News
Hindupuram: హిందూపురంలో ‘ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం’ రెడీ..
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Ross Taylor : ఆ మ్యాచ్‌లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!