Giorgia Meloni: ప్రపంచ నేతల్లోనే మోదీ అత్యంత ప్రియమైన వ్యక్తి: ఇటలీ పీఎం
ప్రధాని మోదీ అత్యంత ప్రజామోదం ఉన్న నేత అంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ(Giorgia Meloni) కొనియాడారు. భారత్ పర్యటనకు వచ్చిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
దిల్లీ: భారత్ పర్యటనకు వచ్చిన ఇటలీ(Italy) ప్రధాని జార్జియా మెలోనీ(Giorgia Meloni).. ప్రధాని మోదీ(Modi)పై ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన నేత అని కొనియాడారు. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రజామోదం పొందిన మోదీ.. ప్రపంచ నేతల్లోనే అత్యంత ప్రియమైన వ్యక్తి’ అని వ్యాఖ్యానించారు.
డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి, ఇతర బృందంతో కలిసి ఇటలీ(Italy) ప్రధాని గురువారం భారత్‌కు వచ్చారు. మోదీతో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే ఆయన కీలక నేత అని నిరూపణ అయిందని, అందుకు ఆయనకు అభినందనలన్నారు.
ఇదిలా ఉంటే.. గతేడాది జీ20(G20) సదస్సులో భాగంగా బాలిలో మోదీ, మెలోనీ(Giorgia Meloni) భేటీ అయ్యారు. గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన మెలోనీ.. ఇటలీకి మొదటి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారంటూ మోదీ కొనియాడారు. భారత్ జీ20 అధ్యక్షతకు ఇటలీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని మెలోనీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Madhya Pradesh rape: వైరల్ వీడియో చూసి, నా బిడ్డను గుర్తించా: బాలిక తండ్రి ఆవేదన
-
Apple Devices: ఐఓఎస్ యూజర్లకు కేంద్రం సూచన.. అప్డేట్ విడుదల చేసిన యాపిల్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
FootBall in Asian Games: ఇలాగైతే మమ్మల్ని ఎక్కడికీ పంపొద్దు: భారత ఫుట్‌బాల్ కోచ్ ఆవేదన
-
KTR: వరి మాత్రమే సరిపోదు.. ఆయిల్‌పామ్ పండించాలి: కేటీఆర్
-
Amazon Festival Sale: అమెజాన్ పండగ సేల్‌లో TVలపై ఆఫర్లివే..