Girl letter to PM: పెన్సిల్‌, మ్యాగీ ధరలు పెరిగాయి.. ప్రధానికి ఆరేళ్ల బాలిక లేఖ

ధరల పెరుగుదల తనపై ప్రభావం చూపుతోందంటూ ఓ ఆరేళ్ల బాలిక ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ వైరలవుతోంది.........

Updated : 02 Aug 2022 18:32 IST

దిల్లీ: ధరల పెరుగుదలతో తనపై ప్రభావం పడుతోందంటూ ఓ ఆరేళ్ల బాలిక ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ వైరలవుతోంది. ఒకటో తరగతి చదువుతున్న ఆ చిన్నారి పెన్సిళ్లు, మ్యాగీ ధరల పెరుగుదలతో తాను ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానికి లేఖ రూపంలో వివరించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన కృతి దూబే అనే బాలిక రాసిన లేఖ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తన సమస్యలను తెలియజేస్తూ ఆ బాలిక ప్రధానికి హిందీలో లేఖ రాసింది. ‘నా పేరు కృతి దూబే. ఒకటో తరగతి చదువుతున్నా. కొన్ని వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. పెన్సిల్, ఎరేజర్‌ ధరలు కూడా పెరిగాయి. మ్యాగీ ధర కూడా అధికమైంది. ఇప్పుడు నేను పెన్సిల్‌ పోగొట్టుకుంటే మా అమ్మ కొడుతోంది. నేనేం చేయాలి? నా పెన్సిల్‌ను కొందరు దొంగిలిస్తున్నారు కూడా’ అంటూ ఆ బాలిక లేఖలో రాసుకొచ్చింది. ‘మ్యాగీ ప్యాకెట్‌ కొనేందుకు రూ.5తో దుకాణానికి వెళితే.. దుకాణాదారుడు ఇవ్వలేదు. రూ.7 తీసుకురావాలంటూ తిరిగి పంపించాడు. దీంతో నాకు బాధేసింది. అందుకే మీకు ఈ లేఖ రాస్తున్నా’  అంటూ ఆ బాలిక పేర్కొంది. ఈ లేఖను అరూనే హ్యారీ అనే వ్యక్తి షేర్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

70 గ్రాముల మ్యాగీ ప్యాకెట్‌ను రూ.14కు పెంచగా.. 32 గ్రాముల ప్యాకెట్‌ను రూ.7 అయింది. బాలిక లేఖపై న్యాయవాది అయిన ఆమె తండ్రి విశాల్ దూబే  మాట్లాడుతూ.. ఆ లేఖ నా కుమార్తె ‘మన్‌ కీ బాత్‌’ అని పేర్కొన్నారు. ఇటీవల పాఠశాలలో పెన్సిల్ పోగొట్టుకున్నందుకు తల్లి మందలించడంతో ఆమె ఏడ్చేసిందని వెల్లడించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts