Haryana: ఇకపై పాఠశాలల్లో భగవద్గీత పఠనం: హరియాణా సీఎం

ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలు పఠింపజేయనన్నట్లు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తామని తెలిపారు. శనివారం కురుక్షేత్రలో నిర్వహించిన ‘అంతర్జాతీయ గీతా మహోత్సవ్‌’ కార్యక్రమంలో

Updated : 13 Dec 2021 09:08 IST

చండీగఢ్‌: ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లోని విద్యార్థులతో భగవద్గీత శ్లోకాలు పఠింపజేయనన్నట్లు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తామని తెలిపారు. శనివారం కురుక్షేత్రలో నిర్వహించిన ‘అంతర్జాతీయ గీతా మహోత్సవ్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 

‘భగవద్గీత అనేది కేవలం అర్జునుడి కోసమే కాదు.. మనందరికీ అందించిన సందేశం. కాబట్టి యువత గీతాలోని సారాన్ని గ్రహించి.. నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి’’అని సీఎం మనోహర్‌లాల్‌ తెలిపారు. జ్యోతిసర్‌లో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ.205కోట్ల వ్యయంతో ‘మహాభారతం’కు సంబంధించిన మ్యూజియం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందులో మల్టీమీడియాను ఉపయోగించి.. భగవద్గీత, వైదిక నాగరికత గురించి వివరించనున్నట్లు తెలిపారు. ఏటా నిర్వహించే గీతా మహోత్సవ్‌ను మరింత ఘనంగా నిర్వహించేందుకు ‘గీతా జయంతి’ పేరుతో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ వేడుకల్లో రామ్‌లీలా, కృష్ణ ఉత్సవ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. 

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని