Nirmala Sitharaman: ‘పెద్ద చేపలను పట్టుకోండి’.. డ్రగ్స్ స్మగ్లింగ్‌పై నిర్మలా సీతారామన్
డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసేవారు.. అధికారుల కంటే తెలివైన వారేం కాదని, ఏదో ఒక చోట కచ్చితంగా దొరుకుతారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
దిల్లీ: దేశంలోకి గుట్టలు గుట్టలుగా మాదకద్రవ్యాలను (Drugs) తరలిస్తున్న స్మగ్లర్లపై గట్టిగా నిఘా పెట్టాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సూచించారు. ఇలాంటి కేసుల్లో ‘పెద్ద చేపలను’ బయటకు లాగి పట్టుకోవాలని తెలిపారు. స్మగ్లర్లు (Smuggling) అధికారుల కంటే తెలివైనవారేం కాదని, ఏదో ఒక చోట వారు దొరుకుతారని అన్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ DRI) 65వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘స్మగ్లర్లు అధికారుల కంటే తెలివైన వారు కాదని మీరు నిరూపించాలి. ఈ తరహా నేరాలు పెరగకుండా మొగ్గలోనే తుంచేయాలి. ఇలాంటి నేరాలపై మీరు మరింత కఠినంగా శ్రమించాలి. ఓ చిన్న ప్యాకెట్ లేదా కిలో కొకైన్‌తో దొరికిన వ్యక్తిని పట్టుకుని కేసును ముగించకూడదు. ఈ దేశంలోకి గుట్టల కొద్దీ మాదకద్రవ్యాలను పంపించేవారిని పట్టుకోవాలి’’ అని అన్నారు.
‘‘మాదకద్రవ్యాల పట్టివేత కేసుల గురించి వార్తలు వచ్చినప్పుడు.. ఇందులో ఎంతమంది జైళ్లకు వెళ్తున్నారు. వీటి వెనుక ఉన్న పెద్ద చేప ఎవరు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానికంగా డ్రగ్స్‌ను విక్రయించే చిన్న చేపలను పట్టుకుంటే సరిపోదు. ఈ డ్రగ్స్ ముఠా వెనుక ఉన్న పెద్ద చేపను పట్టుకుంటేనే ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. స్మగర్లు కచ్చితంగా ఏదో ఒక క్లూ వదిలేస్తారు. దాన్ని పట్టుకుని ఈ నేరాల వెనుక ఉండే బడా వ్యక్తుల వద్దకు చేరుకోవచ్చు. డ్రగ్స్ కేసుల్లో నేరగాళ్లను పట్టుకునేందుకు సాంకేతికతను ఉపయోగించండి. అయితే అదే సమయంలో హ్యాకర్ల నుంచి మీ డేటాకు రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం కూడా ఉంది’’ అని నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సూచించారు.
ఈ కార్యక్రమంలోనే 2021-22లో దేశంలో పట్టుకున్న నార్కోటిక్స్ (Narcotics), అక్రమ బంగారం తదితర వివరాలతో కూడిన నివేదికను విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో డీఆర్ఐ అధికారులు 3,463 కిలోల హెరాయిన్, 321 కేజీల కొకైన్, 833 కేజీల బంగారం, ఇతర మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kotamreddy: అన్నింటికీ తెగించిన వాళ్లే నాతో ఉన్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Movies News
Upasana: కియారాకు సారీ చెప్పిన ఉపాసన
-
World News
Earthquake: ఏ రాయి తొలగించినా ప్రాణం లేని దేహమే.. భూప్రళయంలో 8వేలకు చేరిన మరణాలు
-
Sports News
IND vs AUS: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ హీరోలు వీరే!
-
Movies News
Vijay Sethupathi: నేను కేవలం నటుడిని మాత్రమే... విజయ్ సేతుపతి అసహనం
-
World News
Diabetes: ‘డి’ విటమిన్‌తో మధుమేహం నుంచి రక్షణ!