Goa: గోవా నుంచి తిరుమల..కొత్త పథకానికి సావంత్‌ ప్రభుత్వం శ్రీకారం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించేలా గోవా ప్రజలకు అవకాశం కల్పిస్తూ అక్కడి భాజపా నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టింది. ఉచిత తీర్థయాత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ లాంఛనంగా ప్రారంభించారు.

Published : 07 Nov 2022 22:51 IST

పనాజీ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించేలా గోవా ప్రజలకు అవకాశం కల్పిస్తూ అక్కడి భాజపా నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టింది. ఉచిత తీర్థయాత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ లాంఛనంగా ప్రారంభించారు. పనాజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుమల దర్శనానికి ప్రయాణికులతో బయలుదేరిన బస్సును జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ‘ముఖ్యమంత్రి దేవ్‌దర్శన్‌ యాత్ర యోజన’ కింద ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు.

ఫిబ్రవరిలో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఓట్లు రాబట్టుకునేందుకే భాజపా ఇలాంటి పథకాలు తీసుకొస్తుందని అప్పట్లో అందరూ వ్యాఖ్యానించారని, కానీ, ఇచ్చిన మాట ప్రకారం పతకాన్ని అమలు చేస్తున్నామని ప్రమోద్‌ సావంత్‌ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికే తొలి ప్రాధాన్యత దక్కుతుందన్నారు. తిరుమలతోపాటు తమిళనాడులోని ప్రసిద్ద చర్చి వేలాంగణి, మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా దేవాలయాన్ని తీర్థయాత్రలో భాగంగా సందర్శించుకోవచ్చని అన్నారు. 50 ఏళ్లు పూర్తయిన వారే ఈ పథకానికి అర్హులనీ, వారు మాత్రమే ఆన్‌లైన్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రయాణికులతోపాటు ఒక డాక్టర్‌, పోలీసు, ప్రయాణికులను పర్యవేక్షించేందుకు మరో వ్యక్తి ఉంటారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని