నిరసనలతో దిగి వచ్చిన గోవా ప్రభుత్వం  

ప్రజల నుంచి వచ్చిన నిరసనలకు గోవా ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సట్టారి తాలుకాలోని షెల్‌-మెలౌలిమ్‌ గ్రామంలో ఏర్పాటుకు ప్రతిపాదించిన ఐఐటీ క్యాంపస్‌ను వేరే చోటకు.........

Published : 15 Jan 2021 23:52 IST

ఐఐటీ ప్రాజెక్టు వేరే చోటకు తరలించాలని నిర్ణయం 

పనాజీ: ప్రజల నుంచి వచ్చిన నిరసనలకు గోవా ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సట్టారి తాలుకాలోని షెల్‌-మెలౌలిమ్‌ గ్రామంలో ఏర్పాటుకు ప్రతిపాదించిన ఐఐటీ క్యాంపస్‌ను వేరే చోటకు తరలించాలని నిర్ణయించింది. ఐఐటీ నిర్మాణంతో భూములు కోల్పోయే ప్రమాదం ఉండటంతో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండటంతో సీఎం ప్రమోద్‌ సావంత్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్‌లు, సట్టారి తాలుకా ప్రజా ప్రతినిధులు, ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్‌ రాణెతో తన నివాసంలో సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ఐఐటీ ప్రాజెక్టును సట్టారి నుంచి వేరే చోటకు తరలించనున్నట్టు ప్రకటించారు. స్థానికుల నుంచి వస్తోన్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నామన్న ఆయన.. అందుకే ఈ ప్రాజెక్టును వేరే చోటుకు మారుస్తున్నామన్నారు. అయితే, దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. నిరసనకారులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయని, ఈ కేసులపై పోలీసులు సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 

నిరసనల నేపథ్యంలో ఇటీవల షెల్‌-మెలౌలిమ్‌ గ్రామంలో చోటుచేసుకున్న ఘర్షణలో 12 మంది పోలీసులు, పలువురు గ్రామస్థులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పలువురు ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిరసనకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ ఇదివరకే మంత్రి విశ్వజిత్‌ రాణె సీఎంకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి..

కేంద్రం × రైతులు: తొమ్మిదో‘సారీ’ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని