Harsh Goenka: ..ఇందుకే ఆఫీస్‌కు రమ్మనేది.. గోయెంకా ఆసక్తికర పోస్టు

ఇంటి నుంచి కంటే ఆఫీస్‌ నుంచి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలను హర్ష గోయెంకా (Harsh Goenka) వెల్లడించారు. ఆయన ఇచ్చిన వివరణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

Updated : 30 Sep 2022 13:14 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా నెట్టింట్లో తరచూ ఆసక్తికర విషయాలు పంచుకుంటుంటారు. తాజాగా ఆయన ఇంటి నుంచి కంటే ఆఫీస్‌ నుంచి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వెల్లడించారు. పై ఛార్ట్ రూపంలో ఆయన ఇచ్చిన వివరణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.   

కరోనాకు ముందు వర్క్‌ ఫ్రమ్‌ హోం అనే పదం పెద్దగా వినిపించేది కాదు. కానీ మహమ్మారి కాలంలో ఇది అత్యంత వాడుకలోకి వచ్చింది. పలు రంగాలకు చెందిన ఉద్యోగులు  ఇంటి నుంచే కార్యకలాపాలు చక్కబెట్టాల్సి వచ్చింది. దాదాపు రెండేళ్ల పాటు ఇంట్లో ఉండి పనిచేయడంతో చాలామంది దానికే అలవాటుపడ్డారు. దాంతో కార్యాలయాలకు వెళ్లడం పట్ల కొంతమంది విముఖత చూపుతున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే గోయెంకా ట్వీట్ వచ్చింది.

ఆ పోస్ట్‌లో మొదటి పై ఛార్ట్ ‘వర్కింగ్‌ ఫ్రమ్‌ హోం’కు సంబంధించింది. అది మొత్తం పనితోనే నిండిపోయింది. అదే ‘వర్కింగ్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌’ అని గీసిన ఛార్ట్‌లో చాలా విషయాలకు అవకాశం ఉంటుందని వివరించారు. ‘కాఫీ, లంచ్‌ బ్రేక్ తీసుకోవచ్చు, ట్రాఫిక్‌లో కొద్దిసేపు వేచి ఉండొచ్చు, ఇంకొద్దిసేపు మన పనిచేసుకొని, మన తోటివారికి సహకరించొచ్చు’ అని ఆ ఛార్ట్‌లో పేర్కొన్నారు. గోయెంకా ఈ ట్వీట్‌ చేస్తూ.. ఓ వ్యాఖ్యను జోడించారు. ‘మీరు ఆఫీస్‌ నుంచే పనిచేయాలనేందుకు కారణమిదే’ అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు తమ అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని