Odisha: ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదాన్ని మర్చిపోక ముందే మరో దుర్ఘటన చోటు చేసుకొంది. బర్గఢ్ జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
ఇంటర్నెట్‌డెస్క్: ఒడిశాలోని బాలేశ్వర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన ఘటన మరువక ముందే మరో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. సోమవారం ఉదయం ఒడిశాలోని బర్గఢ్ జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సున్నపు రాయి లోడుతో వెళుతున్న ఈ రైలు సంబర్‌ధార వద్ద ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ రైలు బర్గఢ్ నుంచి దుంగ్రీ ప్రాంతానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఏసీసీ సిమెంట్ కర్మాగారంలో సున్నపురాయి గనుల నుంచి ప్లాంట్‌కు లోడు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
గత శుక్రవారం బాలేశ్వర్ వద్ద యశ్వంత్‌పూర్, కోరమాండల్ సూపర్‌ఫాస్ట్, గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 270 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న సమయంలోనే ఒడిశాలో మరోచోట రైలు బోగీలు తప్పడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
SupremeCourt: కేసు విచారణకు 40 ఏళ్లు.. 75 ఏళ్ల దోషికి సుప్రీం కోర్టు బెయిల్
-
Salaar Vs Dunki: షారుక్ ‘డంకీ’కి పోటీగా ప్రభాస్ ‘సలార్’.. మీమ్స్ మామూలుగా లేవు!
-
ఉత్తరాంధ్ర వాసులకు గుడ్‌న్యూస్.. విశాఖ నుంచి నేరుగా వారణాసికి రైలు
-
Chandrababu Arrest: వచ్చే ఎన్నికల్లో చంద్రసేనకు 160 సీట్లు ఖాయం: అశ్వనీదత్
-
Elon Musk: మస్క్‌ను మలిచిన మూడు పుస్తకాలు.. బయోగ్రఫీలో వెల్లడించిన ప్రపంచ కుబేరుడు
-
Chandrababu Arrest: హైదరాబాద్‌లో ప్రదర్శనలు చేయొద్దంటే ఎలా?: తెదేపా మహిళా నేత జ్యోత్స్న