పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద వీటిని పంపిణీ....

Updated : 23 Apr 2021 16:05 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద వీటిని పంపిణీ చేయనున్నారు. మే, జూన్‌ నెలలకు గానూ ఒక్కొక్కరికీ ఐదు కేజీల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలను అందించనున్నారు. సుమారు 80 కోట్ల మందికి ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.26వేల కోట్లు వెచ్చించనుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో వలస కూలీలు స్వరాష్ట్రాలకు తరలిపోతున్నారు. కొందరు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని