Prohibition: ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లపై కేంద్రం నిషేధం.. ఎప్పటినుంచంటే?

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లపై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2025 ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిషేధం అమలులోకి రానుంది.

Published : 03 Oct 2023 16:11 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ డిటోనేటర్ల(electric detonator) తయారీ, వీటిని కలిగి ఉండటం, దిగుమతులు చేసుకోవడంపై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిషేధం 2025 ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనున్నట్టు స్పష్టంచేసింది. భద్రతాపరమైన ఆందోళనలు, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు ప్రమాదకరమైన స్వభావం కలిగినవని కేంద్రం అభిప్రాయపడినట్టు పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) పేర్కొంది. ఈ నిషేధంతో ప్రజా భద్రతకు ప్రయోజనకరమని పేర్కొంటూ ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దిల్లీలో తీవ్ర భూప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు

పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. 2024-25 చివరి నాటికి వీటి ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు కేంద్రం తెలిపింది. ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లపై నిషేధం 2025 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తుందని స్పష్టంచేస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని