Afghan crisis: అఫ్గాన్‌ పరిస్థితులు.. అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు

అఫ్గానిస్థాన్‌లోని తాజా పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ నెల 26న గురువారం ఈ సమావేశం జరగనుంది. అఫ్గాన్‌లోని పరిస్థితులను, భారత్‌ అనుసరించాల్సిన వైఖరి గురించి చర్చించే అవకాశం ఉంది.

Published : 23 Aug 2021 15:10 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌లోని తాజా పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ నెల 26న గురువారం ఈ సమావేశం జరగనుంది. అఫ్గాన్‌లోని పరిస్థితులను, భారత్‌ అనుసరించాల్సిన వైఖరి గురించి చర్చించే అవకాశం ఉంది. అంతకుముందు అఫ్గాన్‌ పరిణామాలపై రాజకీయ పార్టీలకు వివరించాలని ప్రధాని మోదీ విదేశాంగ శాఖకు సూచించారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.

తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో అఫ్గానిస్థాన్ నుంచి అన్ని దేశాలు తమ సిబ్బంది, పౌరుల్ని తరలిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ కూడా ఆ దేశం నుంచి విమానాలు నడుపుతోంది. ఆగస్టు 16న ప్రారంభమైన తరలింపు ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత వాయుసేన, ఎయిర్‌ ఇండియా కలిసి ఈ మిషన్‌లో పాల్గొంటున్నాయి. ఒకానొక దశలో తాలిబన్లు భారతీయుల్ని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తర్వాత అదేం లేదని, కేవలం పత్రాల తనిఖీ కోసమే వారిని తాలిబన్లు ప్రశ్నించినట్లు తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ తరహా పరిణామాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని