Asaduddin Owaisi: వాహనంపై కాల్పుల ఘటన.. అసదుద్దీన్‌ ఒవైసీకి ‘Z’ కేటగిరీ భద్రత

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పుల ఘటన నేపథ్యంలో కేంద్రం ఆయనకు భద్రతను పెంచింది. అసదుద్దీన్‌కు తక్షణమే సీఆర్పీఎఫ్‌

Updated : 04 Feb 2022 14:00 IST

దిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పుల ఘటన నేపథ్యంలో కేంద్రం ఆయనకు భద్రతను పెంచింది. అసదుద్దీన్‌కు తక్షణమే సీఆర్పీఎఫ్‌ బలగాలతో ‘జడ్‌’ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. ‘జడ్‌’ కేటగిరీ కింద 22 మంది భద్రతా సిబ్బందితో పాటు ఒక ఎస్కార్ట్‌ వాహనాన్ని కేటాయించనుంది. వీరిలో నలుగురి నుంచి ఆరుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసు సిబ్బంది కూడా ఉంటారు.   

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై నిన్న దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం ముగించుకుని దిల్లీ వెళ్తుండగా.. హాపుర్‌-గాజీయాబాద్‌ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్‌గేటు వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకొంది. కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

తనపై పెద్ద కుట్ర జరిగిందని, అల్లా దయవల్ల తాను బయటపడ్డానని అసదుద్దీన్‌ చెప్పారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. యూపీలో మరో వారంలో తొలి విడత ఎన్నికల పోలింగ్‌ జరగనున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని