Pfizer: స్థానికంగా తయారీ కోసం ప్రయత్నాలు..!

ప్రభుత్వం ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌లతో టచ్‌లో ఉందని విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది.

Published : 03 Jun 2021 21:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వం ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌లతో టచ్‌లో ఉందని విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఈ టీకాలను స్థానికంగా తయారు చేసేందుకు యత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బగాచీ ‘‘భారత్‌లో స్పుత్నిక్‌-వి టీకాను వేగవంతంగా ప్రవేశపెట్టడానికి సాయం చేశాం. స్థానికంగా తయారు చేసే అంశంపై ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మోడెర్నాలతో చర్చలు జరుపుతున్నాం ’’ అని అన్నారు. 


విదేశాంగశాఖ కార్యదర్శి హర్ష్‌ వి ష్రింగ్లా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన కొవిడ్‌పై సౌత్‌ ఈస్ట్‌ ఏషియా రీజనల్‌ హెల్త్‌ పార్ట్‌నర్స్‌ ఫోరమ్‌ సదస్సులో మాట్లాడుతూ ‘‘ మహమ్మారి స్థాయి విపత్తును ఎదుర్కోవడానికి ప్రపంచ స్థాయిలో సామర్థ్యాలను పెంచే ప్రయత్నాలు చేయాలి. దీనికి భారత్‌ కూడా సహకరిస్తుంది. ఇప్పటికే ప్రపంచ స్థాయి వేదికలైన జీ7, జీ20, క్వాడ్‌, బ్రిక్స్‌, ఐరాస, ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి’’ అని అన్నారు. 

అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నా సంస్థలు భారత్‌కు వ్యాక్సిన్లు అందించేందుకుగాను ప్రభుత్వం నుంచి ఇండెమ్నిటీ(పరిహారాన్ని)ని కోరుతోన్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. ఇంతవరకూ ఏ కంపెనీకి నష్టం వస్తే పూరిస్తామనే హామీని ఇవ్వలేదు. 
అయితే విదేశీ కంపెనీలకు ఇండెమ్నిటీ రక్షణ కల్పించేందుకు తమకెలాంటి సమస్య లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు బుధవారంనాడు చెప్పడం గమనార్హం.  ఈ నేపథ్యంలోనే నేడు సీరమ్‌ సంస్థ కూడా ఇండెమ్నిటీ కోరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని