Rooftop solar: ఇంటి పైకప్పు సోలార్‌ యూనిట్‌ సబ్సిడీ 2026 వరకు పొడిగింపు

ఇంటి పైకప్పు మీద సౌర విద్యుత్తు పలకల యూనిట్‌ను (రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్యానెల్‌- Rooftop Solar) ఏర్పాటుకు సంబంధించిన రాయితీ గడువును 2026 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.

Published : 09 Dec 2022 00:53 IST

దిల్లీ: ఇంటి పైకప్పు మీద సౌర విద్యుత్తు పలకల యూనిట్‌ను (రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్యానెల్‌- Rooftop Solar) ఏర్పాటుకు సంబంధించిన రాయితీ గడువును 2026 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అప్పటివరకు సోలార్‌ ఇన్‌స్టాలేషన్ కోసం ఎలాంటి అదనపు ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదని వినియోగదారులకు సూచించింది. ఈ పథకం లక్ష్యం నెరవేరేంత వరకు రాయితీ కొనసాగుతుందని పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

నేషనల్‌ పోర్టల్‌లో దరఖాస్తు రుసుము లేదా సంబంధిత పంపిణీ సంస్థ సూచించని నెట్-మీటరింగ్/టెస్టింగ్ కోసం అదనపు ఛార్జీల ఎవరైనా కోరితే చెల్లించొద్దని వినియోగదారులకు మంత్రిత్వ శాఖ సూచించింది. అలాంటి ఛార్జీల కోసం వెండర్లు/ ఏజెన్సీలు/ వ్యక్తులు ఎవరైనా డిమాండ్‌ చేస్తే rts-mnre@gov.in ద్వారా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను ఇన్‌స్టాల్ చేయాలనుకునే వినియోగదారులు నేషనల్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రక్రియను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చని తెలిపింది. ఒక కిలోవాట్‌కు (kW) రూ.14,588 చొప్పున 3 కిలోవాట్ల వరకు రాయితీ ఇస్తారు. రూఫ్‌ టాప్‌ సోలార్‌ కోసం ఈ ఏడాది జులైలో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని