Nitin Gadkari: ప్రభుత్వ నిధులతో విగ్రహాలు ఏర్పాటు చేయొద్దు: గడ్కరీ

ప్రభుత్వ నిధులతో విగ్రహాల ఏర్పాటుకు చేయొద్దని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) సూచించారు. అలాంటి వాటికి తాను వ్యతిరేకమన్నారు. 

Published : 18 Jun 2023 23:25 IST

నాగ్‌పూర్‌: ప్రభుత్వ నిధులతో విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు తాను వ్యతిరేకమని, ఉచితంగా ఇచ్చే వాటికి ప్రజలు విలువ ఇవ్వరని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari )అన్నారు. సేవ ప్రాముఖ్యత  ప్రజలకు తెలియాలంటే వారు కొంత ఖర్చును భరించాలని చెప్పారు. నాగ్‌పూర్‌ (Nagpur)లో రాష్ట్రసంత్‌ తుకడోజీ మహారాజ్‌ నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో (RTMNU) ఛత్రపతి శివాజీ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

‘‘ప్రజల నుంచి సేకరించిన నిధులతో విగ్రహం ఏర్పాటు చేయాలన్న కమిటీ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. విగ్రహాలు నెలకొల్పేందుకు ప్రభుత్వ నిధులు ఉపయోగించకూడదని నా అభిప్రాయం. ఉచితంగా ఇచ్చిన వాటికి ప్రజలు విలువ ఇవ్వరు. ఏదైనా పని లేదా సేవకు ఉన్న ప్రాముఖ్యత తెలియాలంటే ప్రజలు దాని కోసం కొంత మొత్తం ఖర్చు చేస్తేనే తెలుస్తుంది. ఇక్కడ శివాజీ మహారాజ్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఒక వ్యక్తి కొంత మొత్తం ఇచ్చాడంటే.. ఆ వ్యక్తికి ఛత్రపతి శివాజీ చూపిన మార్గం, చెప్పిన మాటలతో ఉన్న అనుబంధంగానే చూడాలి. ఈ విగ్రహ ఏర్పాటు ఎంతో మంది ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం శుభ పరిణామం. శివాజీ ఆలోచనలు, బోధనలు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించాలి’’ అని గడ్కరీ ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని