Seat belts: కార్లలో త్రీపాయింట్‌ సీట్‌ బెల్టులు తప్పనిసరి: గడ్కరీ

రోడ్డు ప్రమాదాల్లో మరణాలను అరికట్టేందుకు ఉపయోగపడే సీటు బెల్టుల విషయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని కార్లలో ఫ్రంట్‌ ఫేసింగ్‌ ప్రయాణికులందరికీ త్రీపాయింట్‌ సీట్‌ బెల్టులు ఇవ్వాలని కార్ల తయారీ కంపెనీలకు ప్రభుత్వం సూచించింది.

Published : 10 Feb 2022 23:10 IST

దిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో మరణాలను అరికట్టేందుకు ఉపయోగపడే సీటు బెల్టుల విషయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని కార్లలో ఫ్రంట్‌ ఫేసింగ్‌ ప్రయాణికులందరికీ త్రీపాయింట్‌ సీట్‌ బెల్టులు ఇవ్వాలని కార్ల తయారీ కంపెనీలకు ప్రభుత్వం సూచించింది. మధ్య, వెనుక సీట్లలో వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీనికి సంబంధించి ఫైల్‌పై నిన్ననే సంతకం చేసినట్లు గురువారం ఆయన మీడియాకు తెలిపారు.

ప్రస్తుతం చాలా వరకు కార్లలో ముందువైపు, వెనుకవైపు సీట్లకు మాత్రమే త్రీ పాయింట్‌ సీటు బెల్టులను కార్ల తయారీ కంపెనీలు అందిస్తున్నాయి. మధ్య సీట్లలో టు-పాయింట్‌ సీటు బెల్టులు (విమానాల్లో ఉండే తరహావి) ఇస్తున్నారు. ఇకపై ఏ వరుసలో కూర్చున్నారన్న దానితో సంబంధం లేకుండా రోడ్డుకు అభిముఖంగా కూర్చున్న ప్రతి ఒక్కరికీ త్రీపాయింట్‌ సీటు బెల్టు ఇవ్వాలని గడ్కరీ తెలిపారు. దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే అందులో 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని