Covid vaccine: 18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్‌ డోస్‌..?

Covid vaccine: దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్‌ డోసు (booster shot) ఇచ్చే విషయమై కేంద్రం యోచిస్తోంది.

Published : 22 Mar 2022 01:23 IST

దిల్లీ: దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్‌ డోసు (booster shot) ఇచ్చే విషయమై కేంద్రం యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతుండడం, అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి మూడో డోసు నిబంధన అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హెల్త్‌ కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు సహా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రికాషన్‌ డోసు (Covid vaccine) పేరిట మూడో డోసు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన వారికీ బూస్టర్‌ డోసు కేంద్రం ఇవ్వనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, మూడో డోసు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా ఉచితంగానే ఇస్తారా? లేదా ప్రైవేటులో డబ్బులు చెల్లించి వేసుకోవాలా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

దేశంలో గతేడాది జనవరి 16న కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత ఆరోగ్య కార్యకర్తలు, ఆ తర్వాత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా వేయడం ప్రారంభించారు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి కో-మార్బిడిటీ ఉన్న వాళ్లకు తొలుత ప్రాధాన్యం ఇచ్చారు. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా తీసుకునే అవకాశం కల్పించారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వయసు వారికి, మార్చి 16 నుంచి 12-14 ఏళ్ల వయసు వారికీ టీకా తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని