Updated : 04/12/2021 16:24 IST

AK-203 rifles: అమేఠీలో 5లక్షల ఏకే-203 తుపాకుల తయారీ

దిల్లీ: రక్షణ ఉత్పత్తులలో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక ఏకే-203 తుపాకులను ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో తయారు చేయడానికి అంగీకారం తెలిపింది. రష్యా సహకారంతో మొత్తం ఐదు లక్షల తుపాకులను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌ రక్షణ ఉత్పత్తుల కేంద్రంగా మారనుందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.

ఇప్పటి వరకు రక్షణ ఉత్పత్తుల దిగుమతిదారుగా ఉన్న భారత్‌.. క్రమంగా ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా సాగుతోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని తెలిపాయి. ఎంఎస్‌ఎంఈలు సహా ఇతర పరికరాల కంపెనీలకు భారీ ఎత్తున ఆర్డర్లు లభించనున్నాయని పేర్కొన్నాయి. దీంతో స్థానికంగా ఉద్యోగ కల్పన జరుగుతుందని వెల్లడించాయి.

గత మూడు దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న ఇన్సాస్‌ తుపాకుల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. 7.62 x 39ఎంఎం తూటాలను పేల్చగల సామర్థ్యం ఏకే-203 సొంతం. వీటితో కాల్చే తూటా 300 మీటర్ల వరకు దూసుకెళ్లగలదు. ఈ తుపాకుల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు. దీంతో సైనికుల పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుంది. పైగా ఇవి తేలికగా ఉంటాయి. ఉగ్రవాద నిరోధక, చొరబాటు యత్నాలను తిప్పికొట్టే ఆపరేషన్లలో ఇవి సమర్థంగా పనిచేస్తాయని నిపుణులు తెలిపారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని