392 వాయు మార్గాల్లో బిడ్డింగ్‌కు ఆహ్వానం

ఉడాన్‌ 4.1 పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 392 వాయు మార్గాల్లో బిడ్డింగ్‌ను తెలిచేందుకు పౌర విమానయాన శాఖ సిద్ధమైంది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఈమేరకు ఎన్‌ఐసీ పోర్టళ్లు, బిడ్డింగ్‌ పత్రాలను....

Updated : 14 Mar 2021 15:18 IST

దిల్లీ: ఉడాన్‌ 4.1 పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 392 వాయు మార్గాల్లో బిడ్డింగ్‌ను తెరిచేందుకు పౌర విమానయాన శాఖ సిద్ధమైంది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఈమేరకు ఎన్‌ఐసీ పోర్టళ్లు, బిడ్డింగ్‌ పత్రాలను ఉంచిన విమానయాన శాఖ ఆసక్తిగల విమానయాన సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియకు ఆరు వారాల సమయం పడుతుందని తెలిపింది. ఇప్పటివరకు 4 బిడ్లను విజయవంతంగా నిర్వహించిన కేంద్రం ఇప్పుడు 4.1 చేపడుతోంది. ఈ 4.1 పథకం కింద చిన్నచిన్న విమానాశ్రయాలు, ప్రత్యేక హెలికాప్టర్లు, సీప్లేన్‌ రూట్లను కలపాలని నిర్ణయించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని