Websites Block: 67 అశ్లీల వెబ్‌సైట్‌లపై కేంద్రం వేటు!

అంతర్జాలంలో అశ్లీల వెబ్‌సైట్‌(Websites)లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. 67 వెబ్‌సైట్‌లను తక్షణమే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ కంపెనీలను ఆదేశించింది. 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనల...

Published : 29 Sep 2022 21:28 IST

దిల్లీ: అంతర్జాలంలో అశ్లీల వెబ్‌సైట్‌(Websites)లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. 67 వెబ్‌సైట్‌లను తక్షణమే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ కంపెనీలను ఆదేశించింది. 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనల(IT Rules 2021)కు అనుగుణంగా, కోర్టు ఆదేశాలను అనుసరించి ఈ చర్యలు తీసుకోవాలని సూచించింది. టెలికాం విభాగం(DoT).. ఈ మేరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల(ISP)కు ఈ-మెయిల్‌ పంపింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ(MeitY) మార్గదర్శకాలతోపాటు పుణె కోర్టు ఆదేశాల ఆధారంగా 63 వెబ్‌సైట్‌లను, ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల ఆధారంగా నాలుగు.. మొత్తం 67 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని స్పష్టం చేసింది. ‘సంబంధిత వెబ్‌సైట్‌లలోని అశ్లీలత.. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తోందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఐటీ నిబంధనలతోపాటు కోర్టుల ఉత్తర్వులకు అనుగుణంగా.. వెంటనే వాటిని బ్లాక్‌ చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది’ అని టెలికాం విభాగం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని