- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Covovax: చిన్నారులపై ప్రయోగాలు వద్దు
దిల్లీ: రెండు నుంచి 17ఏళ్ల మధ్యవయస్సు వారి పై కొవొవాక్స్ క్లినికల్ ప్రయోగాలు ఇప్పుడే వద్దని నిపుణుల కమిటీ తెలిపింది. ఈ మేరకు పిల్లలపై ప్రయోగాల కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి సిఫార్సు చేసింది.
అమెరికాకు చెందిన నొవావాక్స్ అభివృద్ధి చేసిన ఈ కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో ‘కొవొవాక్స్’ పేరుతో ఉత్పత్తి చేసేందుకు సీరమ్ సంస్థ ఒప్పందంద కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 18ఏళ్లు పైబడినవారిపై ఈ టీకా క్లినికల్ ట్రయల్స్‌ను కంపెనీ ప్రారంభించింది. జులై నుంచి చిన్నారులపై కూడా ప్రయోగాలు జరపాలని భావించింది. ఇందుకోసం గత సోమవారం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది. దేశ వ్యాప్తంగా 10 కేంద్రాల్లో 920 మంది చిన్నారుల (2-11 ఏళ్ల వారు 460 మంది, 12-17 ఏళ్ల వారు 460 మంది)పై రెండు, మూడో దశ క్లినికల్ ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ దరఖాస్తును డీసీజీఐ.. నిపుణుల కమిటీకి పంపించింది.
సీరమ్ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ.. ఈ వ్యాక్సిన్ ఇంకా ఏ దేశంలోనూ అనుమతి పొందలేదనే విషయాన్ని గుర్తించింది. అందువల్ల ముందు పెద్దలపై ప్రయోగాలు పూర్తి చేయాలని కమిటీ సీరమ్‌కు సూచించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ‘‘ప్రస్తుతం పెద్దలపై జరుగుతున్న కొవొవాక్స్ క్లినికల్ ప్రయోగాల భద్రత, సమర్థత ఫలితాలను కంపెనీ సమర్పించాలి. ఆ ఫలితాలను పరిశీలించిన తర్వాతే చిన్నారులపై ప్రయోగాల అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’’ అని కమిటీ సూచించింది. ఈ మేరకు చిన్నారులపై ప్రయోగాలకు సీరమ్‌కు ఇప్పుడే అనుమతులు ఇవ్వొద్దంటూ కేంద్రానికి సిఫార్సులు చేసినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
గతేడాది ఆగస్టులో నొవావాక్స్‌తో సీరమ్ లైసెన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో 18ఏళ్లు పైబడినవారిపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. సెప్టెంబరు నాటికి ఈ టీకాలను అందుబాటులోకి తీసుకురావాలని సీరమ్ భావిస్తోంది. అయితే, అమెరికాలో నొవావాక్స్‌కు అనుమతులు లభించిన తర్వాతనే భారత్‌లోనూ వినియోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే సీరమ్ కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తోన్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi sanjay: భాజపాతో బలప్రదర్శనకు కేసీఆర్ సిద్ధమా?: బండి సంజయ్
-
India News
Bilkis Bano: ఇలాగైతే.. ప్రతి అత్యాచార దోషి విడుదల కోరుకుంటారు!
-
Movies News
Chiranjeevi: మెగా హీరోలను కలవాలనుకుంటున్నారా? మీకిదే అవకాశం!
-
Politics News
Telangana News: కేంద్రానికి నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతి: హరీశ్‌రావు
-
Movies News
Social look: తమన్నా మెల్బోర్న్ మెరుపులు.. అల్లరి అనన్య.. కిస్వాల్ వద్ద నయన్జోడీ
-
General News
Fake Police Station: ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ నిర్వహణ.. బిహార్‌లో ఓ ముఠా దుశ్చర్య!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Rahul Gandhi: మోదీజీ.. సిగ్గుచేటుగా అనిపించడం లేదా..! రాహుల్ ఫైర్
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఎక్స్ఛేంజ్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- CBI searches: రూ.11కోట్ల నాణేలు అదృశ్యం.. 25చోట్ల సీబీఐ సోదాలు