ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ను అలా దిగుమతి చేసుకోవచ్చు

ప్రస్తుతం దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పలు అనుమతులను సరళతరం

Updated : 30 Aug 2022 11:34 IST

న్యూదిల్లీ: ప్రస్తుతం దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పలు అనుమతులను సరళతరం చేస్తోంది. వ్యక్తిగతంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ అవసరమైన వారు పోస్ట్‌, ఈ-కామర్స్‌ పోర్టల్స్‌ ద్వారా గిఫ్ట్‌ కేటగిరీ కింద దిగుమతి చేసుకోవచ్చు. తీవ్రమైన కరోనాతో బాధపడుతున్న వారు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వివిధ దేశాలు సైతం భారత్‌కు ఉచితంగా అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే వాణిజ్యమంత్రిత్వశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.  జులై 31 వరకూ మాత్రమే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌కు ఈ అనుమతులు వర్తిస్తాయని తెలిపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం రూ.1000 అంతకుమించిన ఖరీదైన వస్తువులు విదేశాల నుంచి బహుమతి రూపంలో పొందాలంటే 28శాతం జీఎస్‌టీ చెల్లించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు