పాత వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌!

కాలుష్యానికి కారణమవుతున్న వాహనాల విషయంలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య నివారణలో భాగంగా పాతబడిన వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ విధించాలని నిర్ణయించింది. ఇందుకు....

Published : 26 Jan 2021 01:56 IST

దిల్లీ: కాలుష్యానికి కారణమవుతున్న వాహనాల విషయంలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య నివారణలో భాగంగా పాతబడిన వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ విధించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సంతకం చేశారు. రాష్ట్రాల సంప్రదింపుల అనంతరం దీన్ని కేంద్రం నోటిఫై చేయనుందని అధికారులు తెలిపారు.

కాలుష్య నివారణలో భాగంగా 8 సంవత్సరాల పైబడిన రవాణా వాహనాలకు 10 నుంచి 25 శాతం వరకు గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పునరుద్ధరణ సమయంలో ఈ ట్యాక్స్‌ వసూలు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే, 15 సంవత్సరాల కంటే పాత వ్యక్తిగత వాహనాలు కూడా గ్రీన్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. ఈ తరహా వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమయంలో పన్ను వసూలు చేస్తారని చెప్పారు. కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో రిజిస్ట్రేషన్‌ అయ్యే వాహనాలకు అత్యధిక గ్రీన్‌ టాక్స్‌ (రోడ్డు పన్నులో 50 శాతం) వసూలు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉందని పేర్కొన్నారు.

అయితే, హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ, ఇథనాల్‌, ఎల్‌పీజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు కలిగిన వాహనాలకు ఈ ప్రతిపాదన నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే 15 సంవత్సరాల కంటే పాతవైన ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఇకపై కొనసాగించకూడదన్న ప్రతిపాదన కూడా ఉందని పేర్కొన్నారు. పాత వాహనాలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయని, అందుకే ఈ గ్రీన్‌ ట్యాక్స్‌ వసూలుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ట్యాక్స్‌ ద్వారా వసూలైన మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి..
ఆ నోట్లు రద్దు చేస్తారా? ఆర్బీఐ ఏమంటోంది 
కేంద్ర బడ్జెట్‌ యాప్‌.. ఇవి తెలుసుకోండి

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని