Corona: థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు.. ఆ టెస్టింగ్‌ కిట్‌ల ఎగుమతిపై కేంద్రం ఆంక్షలు

కరోనా వైరస్‌ ఆనవాళ్లను నిర్ధారించేందుకు వినియోగిస్తున్న ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. దేశంలో థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందంటూ పలువురు నిపుణులు హెచ్చరిస్తున్న  వేళ ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌- 19 యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్‌లను ఎగుమతులను ఆంక్షల కేటగిరీలో

Published : 16 Aug 2021 23:04 IST

దిల్లీ: కరోనా వైరస్‌ ఆనవాళ్లను నిర్ధారించేందుకు వినియోగిస్తున్న ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. దేశంలో థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందంటూ పలువురు నిపుణులు హెచ్చరిస్తున్న  వేళ ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌- 19 యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్‌లను ఎగుమతులను ఆంక్షల కేటగిరీలో ఉంచుతున్నామని, తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆంక్షల కేటగిరీలో ఉంచిన వస్తువులను ఎగుమతి చేయాలంటే ఎగుమతిదారులు డీజీఎఫ్‌టీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో మన దేశంలో థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ కిట్‌ల లభ్యతను పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని