Sero survey: మరో విడత సీరో సర్వేకు రెడీ

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రకంపనలు.. మూడో వేవ్‌ పొంచి ఉందన్న భయాల నేపథ్యంలో మరో సీరో సర్వే నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా నాలుగో విడత సీరో..

Published : 01 Jun 2021 20:05 IST

దిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రకంపనలు.. మూడో వేవ్‌ పొంచి ఉందన్న భయాల నేపథ్యంలో మరో సీరో సర్వే నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా నాలుగో విడత సీరో సర్వే ఈ నెల నిర్వహించనుంది. ఈ సర్వే ద్వారా ఎంతమందిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయో తెలుసుకోనుంది. ఈ సారి చిన్నారులతో పాటు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించనుంది.

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఈ సీరో సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేలో భాగంగా మొత్తం 28వేల బ్లడ్‌ శాంపిల్స్‌ను సేకరించనుంది. పెద్దవారి నుంచి 14వేల శాంపిళ్లు, ఆరేళ్లు పైబడిన వారి నుంచి మరో 14వేల శాంపిళ్లను సేకరించనున్నారు. ముఖ్యంగా ఈ సారి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో ఏ మేర యాంటీబాడీలు వృద్ధి చెందుతాయో తెలుసుకోనున్నారు. 

తొలి విడత సీరో సర్వే గతేడాది మే 11 నుంచి జూన్‌ మధ్య నిర్వహించగా.. పెద్దలు 0.73 శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు గుర్తించారు. సెకండ్‌ సర్వేలో పదేళ్లు పైబడిన మొత్తం జనాభాలో 7 శాతం మంది కొవిడ్‌ బారిన పడినట్లు తేలగా.. మూడో విడత సర్వే వచ్చేసరికి ఆ సంఖ్య 21 శాతానికి చేరింది. మరోవైపు కొవిడ్‌ మూడో విడతలో ఎక్కువగా చిన్నారులపైనే ప్రభావం చూపే అవకాశం ఉందన్న వైద్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఈ విడత సర్వేలో చిన్నారులకు ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని