Center: అవగాహన లేకుండా అలాంటి రాతలు: అమెరికా కథనంపై మండిపడ్డ భారత్
భారత్‌లోని మత స్వేచ్ఛపై విమర్శలు చేస్తూ రెండురోజుల క్రితం అమెరికా నుంచి నివేదిక(US Report) వెలువడింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది.
దిల్లీ: మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయంటూ భారత్(India)లోని మత స్వేచ్ఛను విమర్శిస్తూ అమెరికా ఇచ్చిన నివేదిక(US Report)ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇది పూర్తిగా పక్షపాత, ప్రేరేపిత నివేదిక అని తీవ్రంగా ఆక్షేపించింది. తప్పుదోవ పట్టించే సమాచారం, అవగాహనలేమి వల్ల అటువంటి నివేదికలు వస్తూనే ఉంటాయని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి(Arindam Bagchi) వ్యాఖ్యానించారు.
ప్రపంచవ్యాప్తంగా మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ వార్షిక నివేదికను వెలువరించింది. ఇందులో మత స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా, భారత్, సౌదీ అరేబియా, చైనా వంటి పలు దేశాలను ఆ నివేదికలో ప్రస్తావించింది. దీనిని భారత్ ఖండించింది.
‘అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్(US State Department) విడుదల చేసిన వార్షిక నివేదిక గురించి మాకు తెలిసింది. తప్పుడు సమాచారం, అవగాహన లేమితో ఇలాంటి నివేదికలు వెలువడటం విచారకరం. కొందరు యూఎస్ అధికారుల నోటి నుంచి వచ్చే ప్రేరేపిత, పక్షపాత వ్యాఖ్యానాలు.. నివేదికలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. యూఎస్‌తో ఉన్న మా భాగస్వామ్యానికి మేం విలువ ఇస్తాం. అలాగే భారత్‌ను ఇబ్బందిపెట్టే అంశాలపై స్పష్టమైన వైఖరిని వెల్లడిచేస్తాం’ అని మీడియా ప్రశ్నలకు బాగ్చి సమాధానమిచ్చారు. అయితే అమెరికా(USA) నుంచి ఇలాంటి కథనాలు రావడం ఇదే తొలిసారేం కాదు. గతంలోనూ వీటికి భారత్ గట్టిగానే బదులిచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం