రోజుకు 50KM టార్గెట్‌.. జాతీయ రహదారుల నిర్మాణంపై గడ్కరీ

జాతీయ రహదారుల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రోజుకు 50 కిలోమీటర్లు మేర నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు.

Published : 13 Mar 2022 01:38 IST

దిల్లీ: జాతీయ రహదారుల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రోజుకు 50 కిలోమీటర్లు మేర నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. అదే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఈ మేరకు ‘ఈటీ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌’లో శనివారం ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ వంటి సరిహద్దు ప్రాంతాలకు రోడ్‌ నెట్‌వర్క్‌ను విస్తరించడం తమ ప్రాధాన్య అంశమని వివరించారు.

2020-21లో రోజుకు 37 కిలోమీటర్ల మేర సగటున జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ఇప్పటి వరకు ఇదే గరిష్ఠం. ఈ రికార్డును మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలోపే అధిగమించనున్నామని గడ్కరీ విశ్వాసం వ్యక్తంచేశారు. కొవిడ్‌ కారణంగా రహదారుల నిర్మాణానికి ఆటంకాలు ఏర్పాడ్డాయని వివరించారు.  దేశంలో ప్రస్తుతం సరకు రవాణా వ్యయం 16 శాతంగా ఉండగా.. చైనాలో 12 శాతం, అమెరికాలో 12 శాతం, యూరోపియన్‌ దేశాల్లో 10 శాతం ఉందని పేర్కొన్నారు. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని