ఉద్యమాన్ని అణచివేసేందుకే ఈ నిశ్శబ్దం

శాంతియుతంగా రైతులు చేసే ఉద్యమాన్ని అణచివేసేందుకే గత కొన్ని వారాలుగా ప్రభుత్వం నిశబ్దంగా ఉందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌ అన్నారు.

Published : 01 Mar 2021 18:43 IST

ప్రభుత్వంపై మండిపడ్డ రైతు నాయకుడు రాకేశ్ టికాయిత్‌

లక్నో: శాంతియుతంగా రైతులు చేసే ఉద్యమాన్ని అణచివేసేందుకే గత కొన్ని వారాలుగా ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌ ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ తమను మరోసారి చర్చలకు ఆహ్వానించలేదని ఆయన మండిపడ్డారు. ‘‘ ప్రభుత్వం గత 20 రోజులుగా నిశ్శబ్దంగా ఉంది. ఏదో జరగబోతోందని అనిపిస్తోంది. మా ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనిపిస్తోంది.’’ అని ఆయన అన్నారు. ఏదేమైనా సమస్యకు పరిష్కారం దొరికే వరకూ తాము వెనక్కి తగ్గబోమని ఆయన పేర్కొన్నారు. మార్చి 24 వరకు దేశవ్యాప్తంగా మహా పంచాయత్‌లు కొనసాగిస్తామని వెల్లడించారు.
కొన్ని ప్రాంతాల్లో రైతులు పంటలను తగులబెట్టడంపై ఆయన స్పందిస్తూ.. ఆ చర్యలకు ఇంకా సమయముందన్నారు. కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తూ చాలా ప్రాంతాల్లో రైతులు పంటలను తగులబెడుతున్నా వారు ఇప్పటి వరకూ స్పందించలేదన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో జరిగిన ఘర్షణలకు ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని