అమెరికాతో బంధాలు బలపడాలి: సోనియా

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడన్‌, సెనేటర్‌ కమలా హారిస్‌కు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా శుభాకాంక్షలు తెలిపారు. వారి విజయాన్ని అభినందిస్తూ విడివిడిగా లేఖలు రాశారు. బైడెన్‌, హారిస్‌ నేతృత్వంలో భారత్‌-అమెరికాల మధ్య సంబంధాలు బలోపేతమవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ కోరుకుంటున్నట్లు..

Published : 09 Nov 2020 01:59 IST

దిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడన్‌, సెనేటర్‌ కమలా హారిస్‌కు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా శుభాకాంక్షలు తెలిపారు. వారి విజయాన్ని అభినందిస్తూ విడివిడిగా లేఖలు రాశారు. బైడెన్‌, హారిస్‌ నేతృత్వంలో భారత్‌-అమెరికాల మధ్య సంబంధాలు బలోపేతమవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో బైడెన్‌ చేసిన ప్రసంగాలను సోనియా కొనియాడారు. ప్రజలకు తనపై నమ్మకం కలిగించడానికి తీవ్రంగా శ్రమించారన్నారు. 

‘‘ మీ ప్రసంగాలు, ప్రజల్లో ఏర్పడిన వర్గ విభేదాలను నయం చేసేందుకు మీరు పడిన శ్రమ,  లింగ, జాతి సమానత్వం ద్వారా ఎంతో స్ఫూర్తి పొందాము’’ అని సోనియా తన లేఖలో పేర్కొన్నారు. బైడెన్‌ నాయత్వంలో కేవలం మన రీజియన్‌లో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో శాంతిస్థాపన జరగాలని, అన్నిదేశాలూ అభివృద్ధి సాధించాలని సోనియా ఆకాంక్షించారు.

‘అచంచలమైన ధైర్యానికి’ అభినందనలు అంటూ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలాహారిస్‌ను సోనియా ప్రశంసించారు. భారత్‌, అమెరికా మధ్య స్నేహాన్ని హారిస్‌ మరింత రెట్టింపు చేయాలని ఆకాంక్షించారు. కమలా హరిస్‌ విజయాన్ని బ్లాక్‌, ఇండియన్‌ అమెరికన్ల విజయంగా అభివర్ణించారు. ప్రజాస్వామ్య విలువలను , మానవహక్కుల గురించి ప్రపంచవ్యాప్తంగా వినిపించేందుకు మద్దతివ్వాలన్నారు. త్వరలోనే ఆమెను భారత్‌కు ఆహ్వానిస్తానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని