బుల్లెట్‌ కోసం వరుడి డిమాండ్‌.. షాక్‌ ఇచ్చిన వధువు

వరకట్నం కారణంగా పీటల దాకా వచ్చి ఆగిపోయిన పెళ్లిళ్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌ బరేలీలో జరిగింది. అయితే.. ఇక్కడ కట్నం అడిగిన వరుడికి పెళ్లి కూతురే షాకిచ్చింది. కట్నం కోసం పట్టుబట్టిన అతనితో తనకు పెళ్లి వద్దని...

Published : 30 May 2021 11:23 IST

బరేలీ: వరకట్నం కారణంగా పీటల దాకా వచ్చి ఆగిపోయిన పెళ్లిళ్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌ బరేలీలో జరిగింది. అయితే.. ఇక్కడ కట్నం అడిగిన వరుడికి పెళ్లి కూతురే షాకిచ్చింది. కట్నం కోసం పట్టుబట్టిన అతనితో తనకు పెళ్లి వద్దని తెగేసి చెప్పింది. పర్తాపుర్‌ చౌధరీ గ్రామానికి చెందిన ఖలీల్‌ ఖాన్‌ కూతురు కుల్సుమ్‌కు జీషన్‌ ఖాన్‌తో వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరిలో వారి నిశ్చితార్థం జరిగిన సమయంలో వరకట్నానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదు. రెండు రోజుల క్రితం బరాత్‌ పెట్టుకోగా.. అందుకు ఏర్పాట్లు చేశారు ఖలీల్‌. కట్నకానుకలు కూడా సిద్ధం చేశారు. అయితే ఆకస్మికంగా బుల్లెట్‌ కావాలని వరుడు డిమాండ్‌ చేశాడు. లాక్‌డౌన్‌ అయినందున తక్షణం కొనుగోలు చేయడం వీలుపడదని చెప్పగా.. బుల్లెట్‌ ధర రూ.2.30లక్షలు అయినా చెల్లించాలని పట్టుబట్టాడు. అప్పటికప్పుడు ఆ మొత్తాన్ని ఏర్పాటు చేయగలిగారు ఖలీల్‌. కానీ, కాసేపటికే అనారోగ్యం బారినపడ్డారు. దీంతో అతిథులందరి ముందే ఆ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది వధువు. తండ్రి సహా ఎవరు ఎంత చెప్పినా వినలేదు. చివరకు వారి వివాహం రద్దయ్యింది.
 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts