
Published : 25 Jan 2022 18:33 IST
Viral Video : మంచులోనే వరుడి ఊరేగింపు..వీడియో వైరల్ !
చంబా : పెళ్లి ముహూర్తం ముంచుకొస్తుండటంతో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి మంచులోనే ఊరేగింపుగా వెళ్లి వివాహం చేసుకున్నాడు. చంబా జిల్లా బిద్రోహ్ నాలా ప్రాంతానికి చెందిన వినీత్ ఠాకూర్‌కు దందోరీకి చెందిన నిశా అనే అమ్మాయితో ఈనెల 23న రాత్రి 10గంటలకు వివాహ ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి వేడుక కోసం ఆదివారం వరుడు సహా అతని బంధువులు బయల్దేరగా, భారీగా మంచు కురవడం ప్రారంభమైంది. దీంతో వెనక్కి తగ్గకుండా 6 కిలోమీటర్లు మంచులోనే ఊరేగింపుగా వరుడిని తీసుకెళ్లారు. వధూవరుల జాతకాల ప్రకారం ఆ మూహూర్తమే మంచిదని అందుకే అదే సమయానికి వివాహం జరిపించినట్లు బంధువులు చెప్పారు.
Tags :