Marriage: పెళ్లి పీటలపైనే గుర్రుపెట్టి నిద్రపోయిన వరుడు.. వధువు ఏం చేసిందంటే..!
మద్యం మత్తులో పెళ్లిపీటలపై కూర్చున్న వరుడు (Groom) .. అక్కడే నిద్రపోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన వధువు (Bride) అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది.
నల్‌బరి: పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. వధూవరుల తరఫు బంధువులతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. పండితుడు వేదమంత్రాలతో పెళ్లి తంతు జరిపిస్తున్నాడు. కానీ, శాస్త్రోక్తంగా అతడు చెప్పే మాటలను పెళ్లి కొడుకు (Groom) వినే పరిస్థితిలో లేడు. పూటుగా మద్యం (Liquor) తాగి ఉన్నాడు. కారులోంచి దిగినప్పటి నుంచే వింతగా ప్రవర్తిస్తున్నాడు.పెళ్లిపీటలపైనే నిద్రపోయాడు. అతడి ప్రవర్తనతో చిర్రెత్తుకొచ్చిన వధువు పెళ్లిపీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది. ఈ ఘటన అస్సాం (Assam)లోని నల్‌బరి జిల్లాలో జరిగింది.
ప్రసేన్‌జీత్ హలోయ్ అనే యువకుడికి ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. పెద్దల సమక్షంలో భారీగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. కానీ, మద్యం తాగి పెళ్లి మండపానికి వచ్చిన వరుడిని చూసి వధువు పెళ్లికి నిరాకరించింది. పెళ్లి కొడుకు తరఫు వచ్చిన వారిలో దాదాపు అందరిదీ ఇదే పరిస్థితి. అయితే, కుటుంబ సభ్యులు ఒప్పించడంతో ఆమె పెళ్లి పీటలపై కూర్చుంది. మద్యం మత్తులో తూగుతూనే పెళ్లి కొడుకు ఆమె పక్కన కూర్చున్నాడు. పురోహితుడు చెప్పే మాటలను కూడా వినే పరిస్థితిలో లేడు. పెళ్లిపీటలపైనే నిద్రపోయాడు. దీంతో వధువు కోపంతో అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. పెళ్లి కొడుకు ప్రవర్తనపై వధువు తరఫు బంధువులు గ్రామపెద్దలను ఆశ్రయించారు. అంతేకాకుండా నల్‌బరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పరిహారం చెల్లించాలంటూ వరుడి కుటుంబాన్ని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్