GSAT-N2: జులైలో జీశాట్‌-ఎన్‌2 ప్రయోగం

ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న జీశాట్‌-ఎన్‌2 (జీశాట్‌-20) ఉపగ్రహాన్ని జులై రెండో వారంలో ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

Published : 16 Jun 2024 04:52 IST

జీశాట్‌-ఎన్‌2 ఉపగ్రహం

శ్రీహరికోట, న్యూస్‌టుడే: ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న జీశాట్‌-ఎన్‌2 (జీశాట్‌-20) ఉపగ్రహాన్ని జులై రెండో వారంలో ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా దీనిని అంతరిక్షంలోకి పంపనున్నారు. 4,700 కిలోల బరువుండే ఈ ఉపగ్రహం జీవితకాలం 14 ఏళ్లు. దేశ బ్రాడ్‌బ్యాండ్‌ కమ్యూనికేషన్‌ అవసరాల కోసం జీశాట్‌-ఎన్‌2ను రూపొందించారు. అండమాన్‌ నికోబార్, లక్షద్వీప్‌ సహా భారత్‌ మొత్తానికి ఈ ఉపగ్రహం సేవలు అందనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని