NEET: నీట్‌ పరీక్ష.. అమ్మాయిలు చెవిపోగులు, చైన్లతో రావొద్దు..!

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి నీట్‌ పరీక్ష సెప్టెంబరు 12న జరగనుంది. ఈ పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఎజెన్సీ తాజాగా పరీక్ష

Published : 09 Sep 2021 14:21 IST

డ్రెస్‌కోడ్‌ కచ్చితంగా పాటించాలన్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ

దిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి నీట్‌ పరీక్ష సెప్టెంబరు 12న జరగనుంది. ఈ పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తాజాగా పరీక్ష రాసే విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ ప్రకటించింది. అబ్బాయిలు పొడుగు చేతుల చొక్కాలు, బూట్లు ధరించి రావొద్దని స్పష్టం చేసింది. ఇక అమ్మాయిలు కూడా చెవిపోగులు, చైన్లు వంటి ఆభరణాలు పెట్టుకోవద్దని ఆదేశించింది. 

డ్రెస్‌కోడ్‌ నిబంధనలివే..

* నీట్‌ పరీక్ష రాసే విద్యార్థులు లేత రంగు దుస్తులు మాత్రమే ధరించారు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా పొడుగు చేతులుండే డ్రెస్‌లు వేసుకోవద్దు. ఒకవేళ మతపరమైన సంప్రదాయం ప్రకారం అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తే.. అలాంటి విద్యార్థులు మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్ష కేంద్రానికి రావాలి. 

* అభ్యర్థులు బూట్లు వేసుకుని వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు. స్లిప్పర్లు, తక్కువ హీల్‌ ఉండే సాండిల్స్‌ మాత్రమే వేసుకుని రావాలి.

* వ్యాలెట్‌, పౌచ్‌, గాగుల్స్‌, టోపీలు, హ్యాండ్‌బ్యాగులు వంటివి తీసుకురావొద్దు. 

* పెన్సిల్‌బాక్సు, కాలిక్యులేటర్‌, పెన్ను, స్కేల్‌, రైటింగ్‌ ప్యాడ్‌, వంటికి కూడా అనుమతించరు.

* మొబైల్‌ ఫోన్‌, బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్స్‌, హెల్త్‌బ్యాండ్‌, వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు కూడా తమ వెంట తీసుకురావొద్దు.

* అమ్మాయిలు చెవిపోగులు, చైన్లు, ముక్కు పుడక, నెక్లెస్‌, బ్రాస్‌లెట్‌ వంటి ఆభరణాలు, అబ్బాయిలు చైన్లు, బ్రాస్‌లెట్లు వేసుకోవద్దు.

* పరీక్ష రాసే అభ్యర్థులు తమ వెంట ఎలాంటి ఆహార పదార్థాలు, వాటర్‌ బాటిళ్లు కూడా తీసుకురావొద్దు. అవేవీ పరీక్ష హాలులోకి అనుమతించబోమని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా వచ్చే ఆదివారం నీట్‌ పరీక్ష జరగనుంది. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పెన్‌ అండ్‌ పేపర్‌ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు ఒక గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలి. కరోనా నేపథ్యంలో అభ్యర్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ కూడా చేయనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని