Night Curfew: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. గుజరాత్‌లో నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు!

ఒమిక్రాన్‌ వ్యాప్తి, రాబోయే పండగ సీజన్‌లో జనం రద్దీని దృష్టిలో ఉంచుకొని గుజరాత్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది....

Published : 20 Dec 2021 23:49 IST

అహ్మదాబాద్‌: ఒమిక్రాన్‌ వ్యాప్తి, రాబోయే పండగ సీజన్‌లో జనం రద్దీని దృష్టిలో ఉంచుకొని గుజరాత్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ నెలాఖరు వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్‌ 31 వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, సూరత్‌, రాజ్‌కోట్‌, వడోదర, భవ్‌నగర్‌, జామ్‌నగర్‌, జునాగఢ్‌లలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలుకానుంది. ఆయా నగరాల్లో అర్ధరాత్రి దాకా 75శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు పనిచేసేందుకు అనుమతి కల్పించారు. ఈ ఒక్కరోజే గుజరాత్‌లో మరో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 11కి పెరిగింది.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని