Modi: అంబులెన్స్‌కు దారిచ్చేందుకు.. ప్రధాని మోదీ కాన్వాయ్‌ నిలిపివేత..!

ప్రధాని మోదీ అహ్మదాబాద్‌ నుంచి గాంధీనగర్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తోన్న సమయంలో ఓ అంబులెన్స్‌ (Ambulance) వచ్చింది. దీంతో కొన్ని క్షణాల పాటు ప్రధాని కాన్వాయ్‌ను రోడ్డుకు ఓవైపు నిలిపివేశారు.

Published : 01 Oct 2022 02:24 IST

అహ్మదాబాద్‌: రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గుజరాత్‌లో పలు కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌ నుంచి గాంధీనగర్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తోన్న సమయంలో ఓ అంబులెన్స్‌ (Ambulance) వచ్చింది. దీంతో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను రోడ్డుకు ఓవైపు నిలిపివేశారు. కాన్వాయ్‌ దాటి అంబులెన్స్‌ ముందుకు వెళ్లిపోయిన తర్వాత వాహన శ్రేణి ముందుకు కదిలిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి మోదీ అహ్మదాబాద్‌లోని దూరదర్శన్‌ కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు బయలు దేరారు. అదే సమయంలో వచ్చిన ఓ అంబులెన్స్‌కు దారిచ్చేందుకుగానూ మోదీ కాన్వాయ్‌ కొన్ని క్షణాలపాటు రోడ్డుకు ఓవైపు నిలిపివేశారు. ఈ వీడియోను గుజరాత్‌ భాజపా మీడియా విభాగం సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది.

సొంత రాష్ట్ర (Gujarat) పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నిన్న సూరత్‌, భావ్‌నగర్‌లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. నేడు గాంధీనగర్‌ - ముంబయి మధ్య సెమీ హైస్పీడ్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) రైలును ప్రారంభించారు. అనంతరం రైలులో కొంతదూరం ప్రయాణించారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts