
మెక్సికోలో కాల్పులు.. 13 మంది మృతి
మెక్సికో: మెక్సికో నగరంలో ఓ క్రిమినల్ గ్యాంగ్ పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో 13 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. సెంట్రల్ మెక్సికోలో గురువారం రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసు వాహన శ్రేణి లక్ష్యంగా ఓ మాదకద్రవ్యాల ముఠా ఒక్కసారిగా కాల్పులకు పాల్పడింది. ఈ దాడిలో 8 మంది పోలీసులు, ఐదుగురు ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేటర్లు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రజా భద్రతా విభాగాధిపతి రోడ్రిగో మార్ట్నెజ్ సెలిస్ మాట్లాడుతూ.. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. సైనికులు, నేషనల్ గార్డ్ దళాలు మెక్సికో నగరవ్యాప్తంగా విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. నిందితులకు తగిన గుణపాఠం చెబుతామన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.