West Bengal: ఇకపై బెంగాల్‌లో నో గుట్కా, పాన్‌ మసాలా

పాన్‌ మసాలా, గుట్కా ఆరోగ్యానికి హానికరమని..  వీటిని పూర్తిగా నిషేధిస్తూ పలు రాష్ర్టాలు ముందుకొస్తున్నాయి. గతనెల హరియాణ ప్రభుత్వం గుట్కా, పాన్‌ మసాలా తయారీతో పాటు అమ్మకాలను నిషేధించిన సంగతి తెలిసిందే. 

Published : 28 Oct 2021 01:26 IST

కోల్‌కతా: పాన్‌ మసాలా, గుట్కాను నిషేధించేందుకు పలు రాష్ర్టాలు ముందుకొస్తున్నాయి. గతనెల హరియాణా ప్రభుత్వం గుట్కా, పాన్‌ మసాలా తయారీతో పాటు అమ్మకాలను నిషేధించింది. ఏడాది పాటు అమ్మకం, కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది. తాజాగా పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం సైతం ఈరెండింటిపై నిషేధం విధించింది. ఈ ఏడాది నవంబర్ 7 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వం.. పొగాకు, నికోటిన్ ఉత్పత్తులపై నిషేధం విధించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో సైతం గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను నిషేధించింది. 2013లో ఖైనీ, పాన్ మసాలా గుట్కాలపై దీదీ ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు ఆంక్షలు విధించింది. ఇక దేశంలోని అనేక రాష్ట్రాల్లో నికోటిన్ కలిపిన గుట్కా లేదా పాన్ మసాలా అమ్మకాలపై ఆంక్షలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఉత్తరాఖండ్, బిహార్, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో సంవత్సరం పాటు ఆంక్షలు విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని