హ్యాకర్లు మా ఉద్యోగుల్ని నియంత్రించారు: ట్విటర్‌

తమ సంస్థలోని కొందరు ఉద్యోగుల్ని హ్యాకర్లు నియంత్రించగలిగారని ట్విటర్‌ తెలిపింది. దాంతో వారు అంతర్గత వ్యవస్థలకు సంబంధించిన వివరాలు పొందగలిగారని వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఫెడరల్‌...

Published : 18 Jul 2020 13:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ సంస్థలోని కొందరు ఉద్యోగుల్ని హ్యాకర్లు నియంత్రించగలిగారని ట్విటర్‌ తెలిపింది. దాంతో వారు అంతర్గత వ్యవస్థలకు సంబంధించిన వివరాలు పొందగలిగారని వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరోకు సహకరిస్తున్నామని పేర్కొంది.

జో బిడైన్‌, ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, బరాక్‌ ఒబామా, వారెన్‌ బఫెట్‌ సహా అనేక మంది ప్రముఖుల ట్విటర్ ఖాతాలను శుక్రవారం హ్యాకర్లు హ్యాక్‌ చేశారు. కొందరి ఖాతాల పాస్‌వర్డులు మార్చారు. కొందరి హ్యాడిల్స్‌ను అమ్మకానికి ఉంచామని సందేశాలు పెట్టారు. కాగా ఎనిమిది మందికి సంబంధించిన పూర్తి సమాచారం, ప్రైవేటు సందేశాలను డౌన్‌లోడ్‌ చేశారని తెలుస్తోంది.

‘కొన్ని వివరాలు తెలిశాయి. ప్రస్తుతం అన్ని ఖాతాలను సరిచేస్తున్నాం. అయితే భద్రతపరమైన కొన్ని విషయాలను చెప్పలేం. ఫొరెన్సిక్‌ సమీక్ష కొనసాగుతోంది’ అని ట్విటర్‌ తెలిపింది. కాగా ప్రపంచ నేతలకు సంబంధించిన ప్రైవేటు సందేశాలను హ్యాకర్లు చదివారా లేదా అన్న సంగతిని సంస్థ చెప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని