Haj: 60వేల మంది స్థానికులకే ‘హజ్‌ యాత్ర’

కరోనా వైరస్‌ కలకలం కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో ప్రారంభం కానున్న హజ్‌ యాత్రకు సౌదీ అరేబియా ప్రభుత్వం పరిమితులు విధించింది. ఈసారి యాత్రలో పాల్గొనేందుకు.....

Updated : 17 Oct 2022 14:49 IST

కొవిడ్‌ నేపథ్యంలో పరిమితులు

దుబాయి: కరోనా వైరస్‌ కలకలం కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో ప్రారంభం కానున్న హజ్‌ యాత్రకు సౌదీ అరేబియా ప్రభుత్వం పరిమితులు విధించింది. ఈసారి యాత్రలో పాల్గొనేందుకు 60వేల మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. అది కూడా 18 నుంచి 65 ఏళ్ల లోపు వయసు ఉండి.. వ్యాక్సినేషన్‌ పూర్తయిన సౌదీ అరేబియా ప్రజలే ఈ యాత్రలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఈ మేరకు శనివారం సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ వెల్లడించింది.  గతేడాది హజ్‌ యాత్రకు సౌదీ అరేబియాలో నివసిస్తున్న 1000 మందికే అవకాశం కల్పించారు. సాధారణంగా హజ్‌యాత్రలో పాల్గొనేందుకే ఏటా 160 దేశాల నుంచి లక్షల మంది ముస్లింలు సౌదీకి వస్తుంటారు. ఈ యాత్రలో పాల్గొన్నవారిలో మూడింట రెండొంతుల మంది విదేశీయులే ఉంటారు. కానీ ఈసారి కరోనా కొత్త వేరియంట్లతో ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో విదేశీలయుకు అవకాశం కల్పించడంలేదని సౌదీ అరేబియా తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని