Published : 14 Dec 2021 21:10 IST

China: 44 కేసులు.. 5 లక్షలకుపైగా జనాభా క్వారంటైన్‌లో!

బీజింగ్‌: కొవిడ్‌ కట్టడికి చైనా మొదటినుంచి కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. తక్కువ కేసులు నమోదవుతోన్నా.. పెద్దఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ, వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు యత్నిస్తోంది. ఇదే క్రమంలో మంగళవారం దేశవ్యాప్తంగా నమోదైన 51 కేసుల్లో.. ఇక్కడి ప్రముఖ పారిశ్రామిక, ఆర్థిక కేంద్రమైన జెజియాంగ్ ప్రావిన్స్‌ నుంచే 44 రావడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు 5.40 లక్షలమందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. పెద్దఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నామని, లాక్‌డౌన్‌లూ విధించినట్లు చెప్పారు.

వందలాది విమానాలు రద్దు..

జీడీపీ, ఎగుమతుల పరంగా చైనా ప్రముఖ ప్రావిన్స్‌లలో జెజియాంగ్ ఒకటి. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రావిన్స్ రాజధాని, ఇక్కడి అతిపెద్ద నగరమైన హాంగ్‌జౌ నుంచి వందలాది విమానాలను రద్దు చేశారు. స్థానికంగా ప్రధాన పోర్టు నింగ్బోతోపాటు సమీపంలోని షాక్సింగ్ నగరంలో, ప్రముఖ పెట్రోకెమికల్స్‌ స్థావరమైన జెన్‌హైలోనూ ఆంక్షలు విధించారు. వాస్తవానికి ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో కేసుల సంఖ్య తక్కువే అయినా.. ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని