Prince Harry: హ్యారీ దంపతులకు ఆడబిడ్డ
బ్రిటన్ యువరాజు హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నవజాత శిశువుకు లిలీబెట్ డయానా మౌంట్‌బాటన్ విండ్సార్ అని నామకరణం చేశారు. శుక్రవారం కాలిఫోర్నియా...
లిలీబెట్ డయానాగా నామకరణం
లండన్: బ్రిటన్ యువరాజు హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నవజాత శిశువుకు లిలీబెట్ డయానా మౌంట్‌బాటన్ విండ్సార్ అని నామకరణం చేశారు. శుక్రవారం కాలిఫోర్నియా(అమెరికా)లోని శాంటా బార్బరా కాటేజ్ ఆసుపత్రిలో లిలీబెట్ జన్మించినట్లు హ్యారీ, మేఘన్ దంపతులు ఆదివారం ప్రకటించారు. ఈ దంపతులకు ఇది రెండో సంతానం. తొలి సంతానమైన అబ్బాయి ఆర్చీ వయసు 2 సంవత్సరాలు. లిలీబెట్.. బ్రిటన్ రాణి ఎలిజబెత్ ముద్దుపేరు. హ్యారీ తల్లి పేరు డయానా. ఆమె 1997లో జరిగిన కారు ప్రమాదంలో చనిపోయారు. ప్రస్తుతం హ్యారీ, మేఘన్ బ్రిటన్ రాజకుటుంబం నుంచి తెగదెంపులు చేసుకొని అమెరికాలో ఉంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్
-
World News
UNO: స్వచ్ఛమైన తాగునీటికి దూరంగా 26 శాతం ప్రపంచ జనాభా
-
Crime News
vizag: విశాఖలో భవనం కూలిన ఘటన.. అన్నాచెల్లెలు మృతి
-
India News
నా భార్యను దోమలు కుడుతున్నాయ్.. పోలీసులకు యువకుడి ఫిర్యాదు
-
Politics News
MP Raghurama: అమరావతిపై మరోసారి అరాచకం: రఘురామ
-
Ap-top-news News
Andhra News: ఆంధ్రప్రదేశ్‌లో తుక్కు పాలసీ అమలు.. తొలుత ప్రభుత్వ శాఖల్లో!