Nayab Singh: దిల్లీ నీటి సంక్షోభానికి కేజ్రీవాలే కారణం: హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ

దిల్లీలో నీటి సమస్యపై హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini) బుధవారం స్పందించారు.   

Published : 19 Jun 2024 19:09 IST

ఛండీగఢ్‌: దిల్లీ(Delhi)లో నీటి సమస్యపై హరియాణా(Haryana) ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini) బుధవారం స్పందించారు. దేశ రాజధానిలో నీటి సంక్షోభానికి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాలే(Arvind Kejriwal) కారణమని మండిపడ్డారు. “మేము దిల్లీకి నీరు విడుదల చేస్తున్నాం. కానీ అక్కడి ప్రభుత్వం నీటి పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించలేకపోయింది. కేజ్రీవాల్ చేసిన తప్పిదాల వల్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకు ముందు ప్రజల ఇబ్బందులను గాలికొదిలేశారు. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం అవినీతి కేసులో ఇరుక్కొని జైల్లో కూర్చున్నారు’’ అని అన్నారు. 

‘‘వాటా ప్రకారం.. హరియాణా నుంచి దిల్లీకి 613 MGD (రోజుకు మిలియన్‌ గ్యాలన్లు) రావాల్సిఉంది. కానీ, హరియాణా మంగళవారం 513 MGDలను మాత్రమే విడుదల చేసింది. ఒక MGD నీరు 28,500 మంది అవసరాలకు వినియోగించవచ్చు. అంటే 28 లక్షల మందికి పైగా నీటి కొరతతో నరకం చూస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటికి ఎన్నోసార్లు అక్కడి ప్రభుత్వానికి లేఖ రాశాను’’ అని ఆప్‌ మంత్రి ఆతిశీ (Atishi)ఆరోపించారు.

పొరుగు రాష్ట్రం హరియాణా దిల్లీకి తక్కువ నీటిని విడుదల చేస్తుందని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(APP) నేతలు ఆరోపిస్తున్నారు. నీటి సంక్షోభం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ దిల్లీ జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ(Atishi) బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి లేఖ రాశారు. శుక్రవారంలోగా సమస్యను పరిష్కరించకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని ఆమె హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని