Haryana: జాతీయ రహదారి దిగ్బంధం..హరియాణాలో ఉద్రిక్తత!

హరియాణాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంటలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందంటూ నిరసిస్తూ రైతులు ఆందోళనలకు దిగారు. భారతీయ కిసాన్‌ మోర్చ ఆధ్వర్యంలో కురుక్షేత్ర సమీపంలోని 44వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. రాష్ట్ర ప్రభుత్వానికి....

Updated : 24 Sep 2022 00:29 IST

చండీగఢ్‌: హరియాణాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంటలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందంటూ నిరసిస్తూ రైతులు ఆందోళనలకు దిగారు. భారతీయ కిసాన్‌ మోర్చ ఆధ్వర్యంలో కురుక్షేత్ర సమీపంలోని 44వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను నిలువరించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. ఒక దశలో బారికేడ్లను పక్కకు తోసి రైతులు ఆందోళన తెలిపారు.

అక్టోబరు 1 నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్రప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే,  అంతకుముందే పంట చేతికొచ్చిన నేపథ్యంలో ముందస్తు కొనుగోలు జరపాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ధాన్యాన్ని నిల్వ చేసేందుకు తగిన సదుపాయాలు లేవని, వేల టన్నుల ధాన్యాన్ని ఎలా నిల్వ చేసుకోవాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మండీల్లో కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంబాలా, కైతాల్‌ తదితర జిల్లాల్లోని మండీల్లో వందల టన్నుల ధాన్యం వర్షానికి పాడైపోతున్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోళ్లు జరపాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని