నీళ్లు విడుదల చేసే వరకూ దీక్ష: ఆతిశీ

దిల్లీకి నీరు అందకుండా చేసేందుకు హత్నీకుండ్‌ బ్యారేజీ గేట్లను హరియాణా ప్రభుత్వం మూసివేసిందని అతిశీ ఆరోపించారు.

Updated : 23 Jun 2024 15:39 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీకి తాగు నీటిని విడుదల చేసే బ్యారేజీ గేట్లను హరియాణా ప్రభుత్వం మూసివేసిందని దిల్లీ జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ(Atishi) అన్నారు. హత్నీకుండ్‌ బ్యారేజీ నిండా నీరున్నా విడుదల చేయట్లేదని ఆరోపించారు. వాటా ప్రకారం దక్కాల్సిన నీటిని విడుదల చేసేంతవరకూ నిరవధిక దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

దేశ రాజధానికి హరియాణా నుంచి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అతిశీ చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది. ‘‘దిల్లీకి అందాల్సిన నీటి కంటే 100 MGD తక్కువగా హరియాణా ప్రభుత్వం విడుదల చేస్తోంది. దీంతో దాదాపు 28 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అని ఆమె ‘ఎక్స్‌’ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు.

లేడీవాక్‌ ఎస్టేట్‌లో ఘనంగా సిద్ధార్థ్‌ మాల్యా వివాహం

దిల్లీకి రావాల్సిన తాగు నీటిని విడుదల చేయాలని కోరుతూ అతిశీ శుక్రవారం నిరవధిక నిరాహార దీక్ష చేప్టటారు. దక్షిణ దిల్లీలోని భోగల్‌లో చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్, దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సరఫరా కోసం ఉత్తరప్రదేశ్, హరియాణాలపై దిల్లీ ఆధారపడుతోంది. వాటా ప్రకారం.. హరియాణా నుంచి దిల్లీకి 613 MGD (రోజుకు మిలియన్‌ గ్యాలన్లు) రావాల్సి ఉంది. కానీ, హరియాణా 513 MGDలను మాత్రమే విడుదల చేస్తోందని ఆప్‌ ఆరోపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని