Vaccine for Children: టీకా తీసుకోకపోతే.. స్కూళ్లలోకి విద్యార్థులకు నో ఎంట్రీ..!
చండీగఢ్: దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉండగా.. మరికొన్ని వారాంతపు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌పైనా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నెల 3నుంచి దేశంలో 15-18 ఏళ్లవారికి కూడా టీకా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. వ్యాక్సిన్ తీసుకోని పిల్లలను పాఠశాలలోకి అనుమతించబోమని హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ఉండగా.. తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 15 లక్షలకుపైగా అర్హులైన పిల్లలు టీకా తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. వారంతా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. పెద్దలతోపాటు టీనేజర్లకు కూడా టీకాలు వేగంగా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పదిరోజుల్లోనే 3కోట్ల మంది టీనేజర్లకు కొవిడ్ టీకా పూర్తి చేసినట్లు చెప్పారు. రాష్ట్రాల వద్ద పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ టీకాల కార్యక్రమం నిర్వర్తిస్తున్నామని.. ఇప్పటి వరకు దేశంలో రెండో డోసు వ్యాక్సినేషన్ 70శాతం పూర్తయిందని ప్రధాని వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: ‘పచ్చళ్ల స్వాతి’గా పాయల్.. మాల్దీవుల్లో షాలిని.. శ్రీలీల డబ్బింగ్!
-
Sports News
CWG 2022: భారత్‌కు పతకాల పంట.. మొత్తం 61 పతకాలు..
-
India News
Kejriwal: మంత్రులకు ఉచిత విద్యుత్ ఇస్తుండగా.. సామాన్యులకు ఇస్తే తప్పేంటి..?
-
India News
UP: మహిళపై దాడి.. భాజపా నేతకు యోగి సర్కార్ ఝలక్..!
-
General News
Picnic: ఒక్కసారిగా వరద.. కొట్టుకుపోయిన 14 కార్లు..
-
India News
Rajinikanth: రాజకీయాల్లోకి వస్తారా? రజనీకాంత్ సమాధానమేంటంటే..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Taapsee: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు: తాప్సి
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్