Rahul Gandhi: విద్వేషం దేశాన్ని బలహీనపరుస్తోంది: తాజా అల్లర్లపై రాహుల్‌ గాంధీ

విద్వేషం, హింస భారత దేశాన్ని బలహీనపరుస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.......

Published : 12 Apr 2022 01:20 IST

దిల్లీ: విద్వేషం, హింస భారత దేశాన్ని బలహీనపరుస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హిందువుల ప్రధాన పండుగ అయిన శ్రీరామనవమి ​​ఊరేగింపు సందర్భంగా నాలుగు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘విద్వేషం, హింస, బహిష్కరణ మన దేశాన్ని బలహీనపరుస్తున్నాయి. సౌభ్రాతృత్వం, శాంతి, సామరస్యంతో కూడిన పునాదులు పురోగతికి మార్గం వేస్తాయి. భిన్న సంస్కృతి, సమ్మిళిత భారతదేశాన్ని కాపాడుకునేందుకు కలిసి నిలబడాలి’ అంటూ కాంగ్రెస్‌ నేత ట్వీట్‌ చేశారు.

శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా నాలుగు రాష్ట్రాల్లో ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో రాహుల్‌ ఈ విధంగా స్పందించారు. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ నగరంలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో పోలీసులు సహా 20 మందికి పైగా గాయపడ్డారు. గుజరాత్‌లోని రెండు నగరాల్లో ఘర్షణలు చెలరేగడంతో ఓ వ్యక్తి మరణించినట్లు సమాచారం. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా హింసాత్మక కేసులు చోటుచేసుకున్నాయి. ఇక వివాదాలకు మారుపేరైన జేఎన్‌యూలోనూ ఘర్షణలు చెలరేగడంతో అక్కడ ఉద్రక్త వాతావరణం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు