Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా..? కారణమిదే..!
Emergency Alert Message: మీ ఫోన్‌కు ఏమైనా అత్యవసర సందేశంతో కూడిన ఫ్లాష్ మెసేజ్ వచ్చిందా? అయితే దాని గురించి మీరేం టెన్షన్ పడకండి. కేంద్రమే ఆ సందేశాన్ని పంపింది. ఎందుకు అనుకుంటున్నారా?
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా కొంతమంది మొబైల్ యూజర్లకు గురువారం మధ్యాహ్నం ఓ ‘ఎమర్జెన్సీ అలర్ట్ (Emergency Alert)’ సందేశం వచ్చింది. ‘తీవ్ర పరిస్థితి’ అన్న అర్థంతో ఆ ఫ్లాష్ మెసేజ్ (Flash Message) ఉంది. దీంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎందుకు వచ్చిందో తెలియక వారంతా గందరగోళానికి గురయ్యారు. అయితే, దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు..! దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపింది. అందులో భయపడాల్సేందేమీ లేదు. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగా ఈ మెసేజ్ వస్తోంది. ఇప్పటికే పలుమార్లు పలు ప్రాంతాల ప్రజలకు ఇలాంటి మెసేజ్‌లు రాగా.. తాజాగా మరోసారి ఈ సందేశం వచ్చింది.
భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదల్లాంటి విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి కేంద్రం ఈ ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థ (Emergency Alert System)ను రూపొందించింది. ఈ క్రమంలోనే తాజాగా దీన్ని పరీక్షించగా.. గురువారం ఉదయం 11.41 గంటల ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కొంతమంది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పెద్ద సౌండ్‌తో ఈ ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో ఈ అలర్ట్‌ను పంపించారు. మెసేజ్‌తో పాటు ఆ సందేశం ఆడియో రూపంలోనూ వినబడింది. దీంతో యూజర్లు ఒకింత ఆందోళనకు గురయ్యారు.
రైలు ప్రమాదాల్లో పరిహారం పదిరెట్లు పెంపు
‘Emergency alert: Severe’ పేరుతో వచ్చిన ఈ సందేశంలో.. ‘‘టెలికమ్యూనికేషన్ విభాగానికి (Department of Telecommunication) చెందిన సెల్ బ్రాడ్‌కాస్టింగ్ పంపించిన నమూనా టెస్టింగ్ మెసేజ్ ఇది. దీన్ని పట్టించుకోకండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించేందుకు ఈ మెసేజ్‌ను పంపించాం. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది’’ అని రాసి ఉంది.
ఈ మెసేజ్ కింద ఉన్న OK ఆప్షన్‌ను క్లిక్ చేయగానే.. మరో మెసేజ్ కన్పించింది. అందులో.. ‘మీకు వైర్లెస్ ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. భవిష్యత్తులోనూ ఇలాంటి ఎమర్జెన్సీ మెసేజ్‌లను పొందేందుకు మీ ఆప్షన్‌ను ఎంచుకోండి’ అని రాసి ఉంది. ఇక మన ఫోన్ సెట్టింగ్స్‌లోనూ వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అనే ఆప్షన్ చేరింది. తమ ఫోన్లకు వచ్చిన ఈ ఫ్లాష్ మెసేజ్‌ను కొంతమంది యూజర్లు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.
మొబైల్ ఆపరేటర్లు, సెల్ బ్రాడ్‌కాస్టింగ్ వ్యవస్థల అత్యవసర ప్రసార సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ పరీక్షలు చేపడుతున్నట్లు టెలికమ్యూనికేషన్ శాఖ గతంలోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దశల వారీగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. గతంలో జులై 20వ తేదీ, ఆగస్టు 17వ తేదీల్లోనూ కొంతమంది యూజర్లకు ఈ మెసేజ్ వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడ్డంకులు అధిగమించి.. ఉత్కంఠకు తెరదించి!
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ మార్గంలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగం పాక్షికంగా కూలిపోవడంతో దాని లోపల చిక్కుకుపోయిన 41 మంది కూలీలు. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్వో, ఐటీబీపీ తదితర బలగాలు. -
ఆ మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించండి
మణిపుర్‌లోని మార్చురీలలో భద్రపరిచి ఉన్న మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన తొమ్మిది స్థలాల్లో ఎక్కడైనా సరే మృతుల ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఆ క్రతువును నిర్వహించాలని మంగళవారం స్పష్టం చేసింది. -
ఆ పోస్టుకు మరో ఐఏఎస్ అధికారి లేరా?
మరో ఆరు నెలల పాటు దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నరేశ్ కుమార్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేయడంతో సుప్రీంకోర్టు మంగళవారం కీలక ప్రశ్నలను సంధించింది. -
సామాజిక మాధ్యమాల్లోని సమాచారంతో పిల్
సామాజిక మాధ్యమాల నుంచి సేకరించిన సమాచారంతో ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది. అలాంటి గణాంకాలతో వాదనలు వినిపించడం సరికాదని హితవు పలికింది. -
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు తెలపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. వివాహ బంధంలో కొనసాగుతున్నా, విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు అవకాశం లేదని జస్టిస్ ఎస్.సునీల్‌దత్ యాదవ్, జస్టిస్ విజయకుమార్ ఏ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. -
మమ్మల్ని వేరే కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు పంపండి
మణిపుర్లో ఘర్షణల నేపథ్యంలో తమకు దేశంలోని ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వెసులుబాటు కల్పించాలంటూ మణిపుర్ విశ్వవిద్యాలయానికి చెందిన 284 మంది విద్యార్థులు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే.. నివేదిక సమర్పణకు గడువు కోరిన ఏఎస్ఐ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన గల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జరిపిన శాస్త్రీయ సర్వే నివేదిక సమర్పణకు మరో మూడు వారాల వ్యవధి కావాలని భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) మంగళవారం జిల్లా కోర్టును కోరింది. -
వృత్తలేఖినితో దాడి కేసు జువైనల్ జస్టిస్ బోర్డుకు
మధ్యప్రదేశ్‌లో ఇందౌర్‌లో తమ తోటి విద్యార్థిని మరో ముగ్గురు విద్యార్థులు వృత్తలేఖిని (జామెట్రీ కంపాస్)తో పొడిచిన కేసును జువైనల్ జస్టిస్ బోర్డుకు అప్పగించాలని ఇందౌర్ పోలీసులు నిర్ణయించారు. -
మన ఆస్ట్రోశాట్ భేష్!
భారత్ ప్రయోగించిన అంతరిక్ష టెలిస్కోపు ‘ఆస్ట్రోశాట్’ ఒక అద్భుత మైలురాయిని సాధించింది. విశ్వంలో 600కుపైగా గామా కిరణ విస్ఫోటాల (జీఆర్బీ)ను గుర్తించింది. -
ఉగ్ర సంబంధాలున్న సంస్థల నిధులు స్తంభింపజేయండి
ఉగ్రవాదంతో సంబంధాలున్నాయని, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నాయని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పేర్కొన్న సంస్థల ఆస్తులను 24 గంటల్లో స్తంభింపజేయాలని, ఇతర ఆర్థిక ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. -
నౌకాదళానికి సూపర్ ర్యాపిడ్ గన్ వ్యవస్థ
భారత నౌకాదళం కోసం 16 ఆధునిక సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ (ఎస్ఆర్జీఎం), ఇతర సాధనాలను సరఫరా చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీహెచ్ఈఎల్ సంస్థ రూ.2,956 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వికసిత భారత్ సంకల్ప యాత్రలో చురుగ్గా పాల్గొనండి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తన మంత్రివర్గ సహచరులను ప్రధాని మోదీ ఆదేశించారు. -
బిపిన్ రావత్ మృతిపై దర్యాప్తు విరమణ
త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది మృతి చెందిన ఘటనలో కేసు దర్యాప్తును విరమించుకుంటున్నట్లు తమిళనాడు పోలీసుశాఖ ప్రకటించింది. -
ఈలం తమిళుల పోరాటం కొనసాగుతుంది
ఈలం తమిళుల రాజకీయ పోరాటం కొనసాగుతుందని ఎల్టీటీఈ అధ్యక్షుడు ప్రభాకరన్ కుమార్తె ద్వారకాగా పేర్కొంటున్న ఓ మహిళ మాట్లాడిన వీడియో వెలుగులోకి వచ్చింది. -
అంగారకుడిపైకి మనిషిని పంపేందుకు ఇస్రో పరిశోధనలు
చంద్రుడు, అంగారకుడిపైకి మానవులను పంపేందుకు ఇస్రో పరిశోధనలు చేస్తోందని ఆదిత్య ఎల్-1 ప్రాజెక్టు డైరెక్టర్ నిగర్ షాజీ తెలిపారు. -
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
రాజ్‌కరణ్ బారువా (56).. మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ నగరంలో రూ.5 వేల జీతానికి రాత్రంతా సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ, పగలు ఇళ్లలోనూ పనిచేస్తారీయన. ఇలా చాలామంది చేస్తూ ఉండవచ్చు. -
కార్మికుల మనోధైర్యానికి జాతి వందనం
ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని దాదాపు 17 రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం విజయవంతంగా బయటపడిన 41 మంది కార్మికుల మనోధైర్యానికి జాతి వందనాలు సమర్పిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. -
పేదలకు అండగా ట్రాన్స్‌జెండర్
పేద కుటుంబాల అమ్మాయిలకు వివాహం చేయడానికి వారి తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అన్నిఇన్నీ కావు. అలాంటి వారి బాధను అర్థం చేసుకున్నారు రాజస్థాన్‌కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్. ఏటా 10 మంది పేద కుటుంబాల అమ్మాయిలకు వివాహం చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. -
కేజ్రీవాల్‌కు గోవా కోర్టు సమన్లు
ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గోవా కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై మపూసా ఫస్ట్‌క్లాస్ జుడీషియల్ మేజిస్ట్రేట్ జారీచేసిన ఈ సమన్లలో బుధవారం కోర్టు ముందు హాజరు కావలసిందిగా పేర్కొన్నారు. -
శీతాకాల సమావేశాల వేళ.. రాహుల్ మళ్లీ విదేశాలకు
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గైర్హాజరు కానున్నట్టు సమాచారం. ఈ సమయంలో ఆయన విదేశీ పర్యటనకు వెళుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు దిల్లీలో ఓటరు కార్డు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మారిన చిరునామాతో కొత్త ఓటరు కార్డును మంగళవారం అందుకున్నారు. దిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి పి.కృష్ణమూర్తి రాష్ట్రపతిభవన్‌లో ముర్మును కలిసిఈ కార్డును అందజేశారు.


తాజా వార్తలు (Latest News)
-
IND Vs AUS: మ్యాచ్‌లో ఓ మలుపు.. ఇషాన్ కిషన్ తప్పిదమే ఆసీస్‌కు కలిసొచ్చింది!
-
East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
-
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య
-
ఇంటర్ విద్యార్థుల ఘర్షణ.. శిరోముండనం చేయించిన కళాశాల యాజమాన్యం!
-
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు
-
శ్వేతసౌధం, పెంటగాన్ ఫొటోలు తీసిన కిమ్ శాటిలైట్?